Take a fresh look at your lifestyle.

పరిస్థితి అర్థం చేసుకోండి… ఎంత చేయగలిగితే అంత మంచి చేస్తా

  • ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాలకు వివరించిన జగన్‌
  • ‌సహకరించడం లేదని పరోక్ష సూచన
  • పిఆర్సీపై ఎటూ తేల్చని ప్రభుత్వం

అమరావతి, జనవరి 6 : ఉద్యోగులకు పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేక పోయింది. ఎప్పటినుంచో ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌తో భేటీ కావాలని ఆశించడంతో వారితో జగన్‌ ‌గురువారం భేటీ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్‌ ‌నిర్వహించిన భేటీలో ఎలాంటి స్పష్టత రాకుండానే సమావేశం ముగిసింది. సమావేశంలో సీఎం జగన్‌ ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్‌ ‌చేసుకున్నానని వెల్లడించారు. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ ‌చేయడానికి అడుగులు ముందుకేస్తామని ఉద్యోగ సంఘాలకు హా ఇచ్చారు. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని, ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను సిఎం జగన్‌ ‌కోరారు. దయచేసి అందరూ ఆలోచన చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నానన్నారు.

ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని, మంచి చేయాలన్న తపనతో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. 2,3 రోజుల్లో దీని పై ప్రకటన ప్రకటన చేస్తామని, నేను  అందరి కుటుంబ సభ్యుడ్నిని ఆయన వెల్లడించారు. కు మనసా, వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు.  సమావేశంలో పీఆర్సీపై చర్చ కొనసాగింది.  ఇప్పటికే ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించారు. మరోసారి సీఎంతో ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నారు. మొత్తంగా సిఎం ఈ భేటీలో తెలంగాణతో పోల్చుకోవద్దని కూడా అన్నారు.

తెలంగాణ రాబడికి ఎపి రాబడికి తేడా ఉందని కూడా అన్నారు. ఇకపోతే ఉద్యోగ సంఘాల తరఫున వెంకట్రామిరెడ్డి, కెఆర్‌ ‌సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, ఇతర నాయకులు హాజరయ్యారు. పీఆర్సీపై కొద్ది రోజులుగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌బుధవారంనాడు కూడా ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు. పీఆర్సీపై ఇప్పటికే ప్రభుత్వం వివిధ స్థాయిల్లో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అనేక ఏళ్లుగా ఊసేలేని జాయింట్‌ ‌స్టాఫ్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశాలను పలుమార్లు నిర్వహించి ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించారు.

కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను సంతృప్తి పరిచేలా పీఆర్సీ ఎంత ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ‌సర్‌ ‌శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ ‌చర్చించి, పూర్తిస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్‌, ‌ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులతో సమావేశమై ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పిన ప్రతి అంశంపైనా సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీలు ఆందోళనలను విరమించుకున్నాయి. అయితే గురువారం సిఎం జగన్‌తెఓ చర్చించినా దీనికి ఎలాంటి స్పష్టత రాలేదు.

Leave a Reply