Take a fresh look at your lifestyle.

రైతుల పొలాల్లో బోర్లు వేయిస్తాం: జగన్‌

అమరావతి,మే 26 : రైతులకు ఏపీ సీఎం జగన్మోహన్‌ ‌రెడ్డి మరో తీపి కబురు చెప్పారు. ఈ ఖరీఫ్‌ ‌నుంచి ఉచితంగా రైతులకు బోర్లు వేయిస్తామన్నారు. గతంలో బోర్లు వేసిన రైతులు తీవ్రంగ ఆనష్పోయారని, ఇక నుంచి ప్రభుత్వమే వేస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ’మన పాలన –  సూచన’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించించిన జగన్‌ .. ‌రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఇక వచ్చే ఏడాది చివరికల్లా గ్రామాల్లో జనతా బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం జగన్‌. ‌రైతులు పండించే 30 శాతం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఆ పంటలను జనతా బజార్ల ద్వారా విక్రయిస్తామని.. రైతు భరోసా సెంటర్లలో ల్యాబ్‌లు, కియోస్క్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దళారీ వ్యవస్థను తొలగించేందుకు రైతు భరోసా సెంటర్ల ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు.

Leave a Reply