Take a fresh look at your lifestyle.

దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందన్ రావును,బిజెపి గూండాలను  వెంటనే అరెస్ట్ చేయాలి

సిద్ధిపేట, ప్రజాతంత్రఅక్టోబర్ 5: సిద్దిపేటలోమొన్న(మంగళవారం) జరిగిన రైల్వే స్టేషన్ లో ఘటన పట్ల బి అర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు
మెరుగు మహేశ్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు నాయిని చంద్రం, సాకి ఆనంద్, జువన్న కనకరాజు ల  అధ్వర్యంలో బారాస బృందం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ లో సిపికి ,సంఘటన పరిధిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేయడం జరిగింది .అనంతరం వారు మాట్లాడుతూ.మొన్న 3న దశాబ్దాల సిద్దిపేట కల నెరవేరుతుందని సంబరంలో సిద్దిపేట ప్రాంత యువకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధిక మొత్తంలో పాల్గొని  సంబరాలు చేసుకుంటున్నా  శుభ సందర్భంలో  దుబ్బాక చెందిన బిజెపి ఏంఎల్ఏ మాధవనేని రఘునందన్ రావు, బిజెపి కి చెందిన గుండాలతో వచ్చి, విద్వంసం సృష్టించిన బిజెపి శ్రేణులను నేరం వైపు ప్రోత్సహిస్తూ, అరాచకానికి ఆజ్యం పోశారని,ఆయనను, ఆయనతో పాటు గుండాలుగా వ్యవహరించిన బిజెపి శ్రేణులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్ అండ్ రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రధాన కారకులైన
 ముఖ్యమంత్రి కెసిఆర్ , మంత్రి తన్నీరు హరీష్ రావు , రాష్ట్ర ప్రభుత్వం నుండి  330 కోట్లు నిర్మాణ వ్యయంగా ఇప్పించి, భూసేకరణకు 310 కోట్లు మొత్తంగా 640 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి రైల్వేకు విడుదల చేయించి, రైల్వే లైను నిర్మాణానికి అహర్నిశలు శ్రమించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు , ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ ఇలా బాధ్యతాయుత ప్రజాప్రతినిధుల ఫోటోలు ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని రైల్వే అధికారులతో మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్నటువంటి దుబ్బాక బీజేపీ శాసనసభ్యులు రఘునందన్ రావు నేరపూరిత స్వభావ ప్రోద్బలంతో బిజెపి నాయకులు వీధి రౌడీల్లా వివరిస్తూ అక్కడే ఉన్నటువంటి మాపైన దాడులు చేస్తూ, ప్లాస్టిక్ కుర్చీలను మాపై విసురగా కింద పడిపోయాము అంతటితో ఆడకుండా బూటు కాళ్లతో తంతు , మరి పార్టీ జెండా కట్టాలతో దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారని వివరించారు
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బిజెపి శ్రేణులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు బండి శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్ గుడిమల్ల రాజలింగం, కొంచం రమేష్, దబ్బట మహేష్, వాటు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply