Take a fresh look at your lifestyle.

రైతు సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు

  • మంత్రులు కె.తారక రామారావు, నిరంజన్‌ ‌రెడ్డి
  • సిరిసిల్లా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కల్వకుంట్ల

రాష్ట్రంలోని రైతులందరి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. వానాకాలంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై అవగాహన సదస్సు వేములవాడలోని మహరాజ ఫంక్షన్‌ ‌హాల్‌లో మంగళవారం నిర్వహించారు.ఈ సదస్సులో రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ ‌మాట్లాడుతూ సిఎం కెసిఆ ర్‌ ‌పట్టుదలతో ఇంజనీర్లను ప్రోత్సహించి కాళేశ్వరంతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేయించారని, దీనితో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటల సాగుకు వీలవు తుందని అన్నారు.రైతులకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామని,తెలంగాణలో విద్యుత్‌, ఎరువులు, విత్తనాల కొరత లేదని,రైతులకు అందుబాటులో వ్యవసాయాధికారులుండి పలు సూచనలు చేస్తూ రికార్డు స్థాయిలో పంటల సాగును కొనసాగించి,అధిక దిగుబడుల ను సాధిస్తున్నామని అన్నారు.ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ చర్యలు తీసుకుంటుందని అన్నారు.రైతు బంధు,రైతు బీమాలను కొనసాగిస్తున్నామని,లాక్‌డౌన్‌ ఉన్నప్పటికిని రాష్ట్ర వ్యాప్తం గా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు.అయితే రైతుల ధాన్యానికి మద్ధతు ధర లభించాలంటే నియంత్రిత సాగు చేపట్టాల్సిన అవసరం ఉందని,అన్నిగ్రామాల్లో వ్యవసాయాధి కారులు సర్వేలు చేసి,భూసార పరీక్షలు నిర్వహించి సూచిం చిన పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదని,అంతేగాకుండా సరైన మార్కెట్‌ ఉం‌టుందని అన్నారు.రైతులకు గిట్టు•టు ధర లభించేట్లుగా తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ ‌మాట్లాడుతూ మెట్టప్రాంతాల్లో తాగు, సాగునీటి కొరతను పూర్తిగా అధిగమించడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాళేశ్వరంతో పాటు వివిధ ప్రాజెక్టులను పూర్తి చేసి,ఎత్తిపోతల ద్వారా ఎగువ ప్రాంతాలకు సైతం నీరందిస్తున్నామని, దీనితో అన్ని గ్రామాల చెరువుల్లో ఎండాకాలంలో సైతం నీరు నిల్వ ఉందని అన్నారు. ఈ సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ‌టెస్కాబ్‌ ‌చైర్మన్‌ ‌కొండూరి రవీందర్‌రావు,కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌,‌జడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ,జిల్లా రైతు సమన్వయ సమితి కో- ఆర్డినేటర్‌ ‌గడ్డం నర్సయ, వేముల వాడ మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌రామతీర్ధపు మాధవి,అన్ని మండలాల రైతు సమన్వయ సమితి సభ్యులు,జడ్పీటిసి సభ్యులు, మండల పరిషత్‌ అధ్యక్షులు, సర్పంచులు పాల్గొన్నారు.

రైతును రాజుగా చేస్తున్న టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం:
ఎల్లారెడ్డిపేట :తెలంగాణ ర్రాంలో రైతులందరిని రాజులుగా చేసేందుకు గత 6 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా రైతు బంధు, రైతు భీమా, నాణ్యమైన విత్తనాలు, ఉచిత కరెంట్‌ను ఇస్తున్నారని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖమంత్రి కెటిఆర్‌ అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్‌, ‌గొల్లపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గొల్లపల్లి గ్రామంలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ గోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం బొప్పాపూర్‌ ‌వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటి నూతన భవనం నిర్మాణాన్ని ప్రారంభించారు. రైతువేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం సమావేశంలో మంత్రి కెటిఆర్‌, ‌వ్యవ సాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిలు మాట్లాడుతూ కరోనా వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న, 3నెలలుగా రాష్ట్ర ఆదాయం 5శాతం వచ్చినప్పటికి రాష్ట్రంలో రైతులు, పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ 1200 ‌కోట్ల రూపాయలను 5లక్షల 50వేల మంది రైతులకు రుణమాఫీ కొరకు నిధులు విడుదల చేశారన్నారు.  వానకాల పంటకు రైతు బంధు కింద 7వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖకు కెసిఆర్‌ అం‌దించారని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఎరువులు, విత్తనాలు రైతులకు సరఫర చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పడకముందు వ్యవసాయం ఎలా ఉం డెదో మీ అందరికి తెలుసన్నారు.  నీటి ప్రాజెక్టులను నిర్మిం చిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై  ప్రతిపక్షాలకు కండ్లు మండుతు న్నాయని అన్నారు. డిమాండ్‌ ‌గల పంటలు రైతులు వేస్తే లాభం ఉంటుందని ఆ పంటలు వేయాలన్నారు. అందరు ఒకే రకమైన పంటలు వేస్తే గిట్టబాటు ధర రాక రైతులు నష్టాలలో ఉంటారని  కెసిఆర్‌ ఆలోచన అన్నారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ ‌చైర్మన్‌ ‌బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌, ‌జడ్పి చైర్‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయ బాలకిషన్‌, ‌టెస్కాబ్‌ ‌చైర్మన్‌ ‌కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, కలెక్టర్‌ ‌దేవరకొండ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌ ‌హెగ్డె, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, టిఆర్‌ఎస్‌ ‌జిల్లా ఇన్‌చార్జీ తోట ఆగయ్య, ఎంపిపి పిల్లి రేణుక కిషన్‌, ‌జడ్పిటిసి చీటి లక్ష్మణ్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కో-ఆర్డినేటర్‌ ‌రాధారపు శంకర్‌, ‌మండల పార్టీ అధ్యక్షుడు వర్సకృష్ణహరి, సర్పంచ్‌ ‌కొండాపురం బాల్‌రెడ్డి, ఎంపిటిసి ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బొమ్మనవెని కృష్ణ, చ్కిల రామారావు, గూడూరు ప్రవీన్‌, ఎం‌పిపిలు, జడ్పిటిసిలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply