Take a fresh look at your lifestyle.

అభివృద్ధి మీ కళ్ల ముందుంది..ఆదరించండి

  • నాతో నడిచే వ్యక్తిని ఎన్నుకోండి..కోతి దండాలను నమ్మకండి
  • ఆపదలో ఆదుకునే నేత కావాలా?వోట్లప్పుడు వచ్చే పార్టీల మనుషులు కావాలా?
  • సిద్ధిపేట మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌రావు

ఆకలయినప్పుడు అన్నం పెట్టి..ఆపదలో ఆదుకునే నేత కావాలా? వోట్లప్పుడు వొచ్చి అబద్ధాలు చెప్పే పార్టీల మనుషులు కావాలా? మీరే ఆలోచన చేసి అభివృద్ధిని ఆదరించి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కోరారు. శనివారం సిద్ధిపేట పట్టణంలోని 31,15వార్డులకు చెందిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థులు జంగిటి కనకరాజు, పాతూరి సులోచన శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఆయా వార్డుల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..నాతో నడిచే వ్యక్తిని ఎన్నుకోండి.

వోట్ల కోసం పెట్టె కోతి దండాలను నమ్మొద్దు. నేను మీ గౌరవాన్ని ఎప్పుడూ పెంచేవాడినని అన్నారు.  సిద్ధిపేట పట్టణాన్ని దేశంలోనే రోల్‌ ‌మోడల్‌ ‌పట్టణంగా చేశాననీ, మేము సిద్ధిపేట ప్రజలమని గర్వంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి మీ కళ్ల ముందు ఉందన్నారు. సిద్ధిపేట పరిశుభ్ర పట్టణంగా ప్రసిద్ధి గాంచిందన్నారు. సిద్దిపేటలో మహిళా భవనాలు కట్టించాననీ,  ఒకనాడు నీళ్లు దొరకని సిద్దిపేటలో నేడు ఇంటింటికి మంచినీళ్లు అందిస్తున్నామన్నారు.

Minister Harish Rao in the Siddipet Municipal Election Campaign

అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ(యూజిడి) ద్వారా మురుగు నీరు పంపి పట్టణాన్ని అందంగా 270 కోట్లతో అభివృద్ధి చేసుకున్నామన్నారు.  కొద్దీ రోజుల్లోనే దోమలు లేని పట్టణంగా  తయారు చేసుకున్నామనీ, పందులను లేకుండా చేసుకున్నామన్నారు. పందులు పోయాయి, ఇగ కోతుల సమస్య ఉండటంతో వాటిని కూడా వెల్లగొట్టామన్నారు. ఇక కుక్కల సమస్య తీర్చేందుకు కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ ‌దవాఖానను రూ.60 లక్షలతో నిర్మించామన్నారు. ప్రజల ప్రతి అవసరాన్ని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వొస్తున్నాననీ, ఇంటిముందుకే చెత్త బండి వొచ్చి తడి, పొడి చెత్తను వేరుచేసి సేకరిస్తున్నామనీ,  శుద్దిపేటగా సిద్దిపేటను మార్చుకున్నామనీ, వైద్యం మెరుగుపరిచామన్నారు.

 

ప్రభుత్వ హాస్పిటల్‌కి వొచ్చే తల్లి బిడ్డకు వేడి వేడి అన్నం పెడుతున్నామనీ, కార్పొరేట్‌ ‌స్థాయిలో పేదలకు ప్రభుత్వ వైద్యం ఇప్పిస్తున్నామన్నారు. పెన్షన్‌ను 2016 చేశామనీ,  కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, ‌సిఎం సహాయ నిధితో ఎంతోమందిని ఆదుకున్నట్లు తెలిపారు.  ఎర్ర చెరువును అద్దంలా తీర్చిదిద్దామనీ, మండు టెండల్లో  చెరువులు మత్తడి దుముకుతున్నాయన్నారు. సిద్దిపేట టిఆర్‌ఎస్‌కు అడ్డా కావాలి. నాకు కొండంత ధైర్యం ఉండాలంటే టిఆర్‌ఎస్‌ అభ్యర్థికి అండగా నిలవాలి. విడిపోతే నష్టపోతాం… కలిసి ఉంటే అభివృద్ధి సాధిస్తాం. ఇక మిగిలింది ఉద్యోగ కల్పన జరగాలి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏడాది వరకు చుకు చుకు రైలు రాబోతుందనీ,  కప్పల కుంటను అభివృద్ధి చేస్తాననీ, ప్రతి అర్హుడికి ఇంటిని ఇస్తున్నామనీ, ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణానికి డబ్బులు అందిస్తున్నామనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, స్థానిక టిఆర్‌ఎస్‌ ‌కౌన్సిలర్‌ అభ్యర్థులు, నేతలతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply