Take a fresh look at your lifestyle.

విధి వంచితులు..!

బరువుతీర్చాల్సిన వారే భారమయ్యారు..

 గడ్డాలొచ్చినా అడ్డాలనాటి బిడ్డలే..!
యుక్త వయసులోనూ తల్లి సేవ)•..
నయం కాని వ్యాధి భారిన ముగ్గురు పిల్లలతో దుర్భర జీవనం…

‘‘అందరి లాగే తమ పిల్లలు కూడా పెరిగి పెద్దవారై ప్రయోజకులు కావాలని తమను ఆసరాగా నిలవాలని ఆ తల్లిదండ్రులు  ఆశించారు.. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. కానీ పిల్లలకు నాలుగు పదుల వయసులోనూ అన్నింటా అమ్మే  తోడై సపర్యలు చేయాల్సిన దుస్థితి.. పుట్టిన ముగ్గురు కొడుకులు మానసిక, శారీరక వికలాంగులులై నిస్సహాయ స్థితిలో మంచానికే పరిమితమయ్యారు.. ఇటీవల ఆ ఇంటి యజమాని మరణంతో ఆ కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది.’’

ప్రారబ్ధం అంటారు ఆధ్యాత్మిక వేత్తలు.. జన్యుపరమైన ఆరోగ్య లోపాలే కారణమంటారు ఇప్పటి ఆధునిక వైద్యులు.. ఏదేమైనా ఆ కుటుంబాన్ని విది వెక్కిరించింది.. పుట్టిన పిల్లలంతా శారీరక, మానసిక రుగ్మతలతో బుద్ది మాంద్యం, శారీరక ఇబ్బందులు తలెత్తడంతో ఇల్లు కదలలేని దుస్థితే కాదు, కనీసం వారి పనులు వారు చేసుకోలేని నిస్సహాయులుగా మారడంతో భవిష్యత్తు అందకారమ య్యింది.. పెరిగి పెద్దవారై•• తమ కాళ్ళపై తాము నిలబడి తల్లిదండ్రులకు చేయూతని వ్వాల్సిన వారు ఇంటికే పరిమితమైపోయి ఆ తల్లికి భారమయ్యారు.. మానసిక, శారీర వికలాంగులుగా నడవలేని, కూర్చోలేని దుస్థితిలో ఉండి కన్న తల్లితో నేటికీ సేవలు చేయించుకుంటున్నారు.. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్‌ ‌బల్దియా పరిధిలోని చెంగిచర్లకు చెందిన శ్రీమతమ్మకు మేనభావ గగ్గలపల్లి శంకర్‌రెడ్డితో గత 40 ఏండ్ల క్రితం వివాహమయ్యింది. వీరికి నరేష్‌ ‌రెడ్డి (37), విఘ్నేశ్వర్‌ ‌రెడ్డి (34), ప్రవీణ్‌రెడ్డి (31) పిల్లలు కలిగారు. ఇద్దరు కొడుకులు పుట్టినప్పటి నుండి పదేళ్ళ వయసు వచ్చేంతవరకు ఆరోగ్యంగానే ఉన్నారు.

అంతేకాదు.. నరేష్‌ ‌రెడ్డి 4వ తరగతి వరకు, విఘ్నేశ్వర్‌ ‌రెడి 3వ తరగతి వరకు బోడ్పుప్పల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివారు. వయసు పెరుగుతున్న కొద్దీ వీరి ఆరోగ్యంలో మార్పులు రాసాగాయి. దీంతో తల్లిదండ్రులు వీరిని నగరంలోని అనేక ప్రైవేటు ఆసుపత్రుల్లో తిప్పి వైద్యం చేయించినా ఫలితం లేకపోగా వ్యాధి ముదిరిపోతూ బుద్దిమాంద్యులుగా మారిపోయారు. ఈ పిల్లలకు మెదడు, నరాలు బలహీనమయ్యాయని, గర్భంలోనే ఈ వ్యాధి సంమ్రించిందని, దీనికి మేనరిక వివాహం ఓ కారణమని వైద్యులు అన్నారని వారి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. కాగా చిన్న కొడుకు ప్రవీణ్‌ ‌రెడ్డి చిన్ననాటి నుండే బుద్దిమాంద్యం, వికలాంగతతో పుట్టినట్లు, అతడిని వైద్యులకు చూయించినా పెద్ద వాళ్లకున్న సమస్యే ఇతనికీ ఉందన్నారని  శ్రీమతమ్మ తెలిపారు. అంతో ఇంతో పెద్ద కొడుకు నరేష్‌ ‌రెడ్డి అస్పష్టంగా మాటలు మాట్లాడడం, అన్నం తినడం వంటివి కొన్ని పనులు మాత్రం చేసుకున్నా ఇల్లు కదలలేని, నడిచి ఎక్కడికీ వెళ్ళలేని దుర్భర స్థితి.

దీంతో ముగ్గురు పిల్లలకు తల్లే అన్ని పనులు చేయాల్సిరావడం చూసే వారి హృదయం ద్రవించుకుపోతుంది. యుక్తవ యసొ చ్చినా ఆ పిల్లలకు బుద్ది వికసించకపోవడం, కాళ్లు, చేతులు సహకరించకపోవడంతో ఇప్పటికీ ఆ తల్లే అన్నీ తానై సేవలు చేయాల్సిన దుర్భరస్థితి. దీంతో శుభకార్యాలకు, విందు, వినోదాలకు వెళ్ళే వీలులేకుండా ఉండంతో అన్నింటికీ దూరమై ఆమె కూడా పిల్లలను విడిచి ఎక్కడికీ వెళ్లలేక ఇంటికే బందీ అయిపోయింది. శ్రీమతమ్మ, శంకర్‌ ‌రెడ్డి కుటుంబం తొలినాళ్ళలో ఆర్ధికంగా తమంతట తాము ఎవరికి చేయి చాచకుండా ఉండేవారు. శ్రీమతమ్మ భర్త శంకర్‌ ‌రెడ్డి అప్పట్లో చెంగిచర్ల సమీపంలో గల పారిశ్రామికవాడలో ఓ ప్రైవేటు కంపెనీలో లేబర్‌ ‌కాంట్రాక్టర్‌గా కొనసాగాడు. అంతలోనే ఆ కంపెనీ మూతబడడంతో పశుపోషణతో కొంతకాలం నెట్టుకొచ్చారు. అటు తరువాత అతనికి వెన్ను నొప్పి ప్రారంభమై కాలు పనిచేయకుండా అయ్యింది.

అతని ఆరోగ్యం కోసం కూడా అప్పులు చేసి వైద్యం చేయించు కోవాల్సివచ్చింది. అటు పుట్టిన పిల్లలందరూ నయం కాని వ్యాధుల భారిన పడడానికి తోడు పులి మీద పుట్రలా భర్త అనారోగ్యానికి గురి కావడం ఆ కుటుంబం పూర్తిగా ఆర్ధికంగా చితికిపోయి అప్పులతో, దారిద్య్రంతో సహవాసం చేయాల్సిన గడ్డు పరిస్థితులు దాపురించాయి.  అయితే ఆయన చివరి రోజుల్లో మూత్రపిండాలు చెడిపోయి తీవ్రంగా భాధపడ్డాడని, ఆయన వైద్యానికి  కూడా లక్షల రూపాయల అప్పులు తెచ్చి పెట్టినా బతకలేదని శ్రీమతమ్మ వాపోయింది. తన ముగ్గురు పిల్లలకు ప్రభుత్వం పించన్‌ అం‌దజేస్తోందని, అయితే కొన్ని అప్పులకు మిత్తీలు కట్టగా నెలకు కేవలం కొద్ది మేర మాత్రమే డబ్బు మిగులుతుందని, వాటితోనే ఇల్లు గడపాల్సివస్తోందని ఆమె వాపోయింది. పిల్లలు, భర్త అనారోగ్యంతో వైద్య ఖర్చులతో ఆర్ధికంగా చితికిపోయామని రోదించింది. పిల్లలను సాకుకుం టూ అప్పులు లేకుండా ఉండాలని ఆమె ఆరాటం. తమను దాతలు ఆదుకోవాలని, దయార్ధ్ర హృదయంతో ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.

Leave a Reply