సూర్యాపేట, మే 9, ప్రజాతంత్ర ప్రతినిధి:రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలుచేస్తున్నామని, సాయంత్రం 6గంటల నుండి ఉదయం 6గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ ఉందని జిల్లా ఎస్పి ఆర్.భాస్కరన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లాక్డౌన్ బందోబస్తును పరిశీలించి సిబ్బంది తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించవొద్దని ఆదేశించారు. ఈ నెల 29వరకు లాక్డౌన్ ఉంటుందని, ఎక్కడకూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.
లాక్డౌన్ సడలించామని అనవసరంగా రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు మాస్క్లు ధరించకుండా రోడ్లపై తిరిగితే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. నిత్యావసరాల నిమిత్తం బైక్పై ఒక్కరికి మాత్రమే అనుమతి ఉందని, ఎట్టిపరిస్థితిలో ట్రిపుల్ రైడింగ్ చేసినా వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. రోడ్లపై ఏర్పాటుచేసిన బారికేడ్లను తొలగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంట్లోనే ఉండాలని సూచించారు. నిబంధనలకు ఉల్లఘించిన 1955మందిపై 1236కేసులు నమోదు చేసి 4779వాహనాలు సీజ్ చేశామని తెలిపారు.