ప్రధాని నరేంద్ర మోడీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొందని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ తొలిసారి ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని ఆర్ బిఐ గురువారం ప్రకటించింది. ఈ క్రమంలో మోడీపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.
మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించడం వల్లనే భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని ఆయన ధ్వజమెత్తారు. మోడీ అనుసరిస్తున్న విధానలతో దేశంలోని బలాలన్నీ బలహీనతలుగా మారాయని ఆయన ఆరోపించారు. దేశ జీడీపీ రెరడో క్వార్టర్లో మైనస్ 8.6 శాతానికి క్షీణించనున్నట్లు ఆర్బీఐ తన నౌకాస్ట్ నివేదికలో పేర్కొన్న క్రమంలో రాహుల్ గాంధీ మోడీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.