Take a fresh look at your lifestyle.

అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12 :అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు పోచమోని కృష్ణ డిమాండ్ చేశారు.అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండోరోజు చేరింది.మంచాల మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు సమ్మెలో కూర్చున్నారు.ఈ కార్యక్రమంలో  సిఐటియు జిల్లా నాయకులు పోచమోని కృష్ణ ,అంగన్వాడి యూనియన్ నాయకులు పద్మ, వైదెవిలు మాట్లాడుతూ, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువగానే సమయం ఇచ్చి ఎక్కువ పనిచేస్తున్నామని చెప్పారు.తమకు మాత్రం పని ఎక్కువ వేతనం తక్కువ ఎందుకని ప్రశ్నించారు.అంగన్వాడీ ఉద్యోగులకు ఉన్న సమస్యలు రిటైర్మెంట్ గ్రాడ్యుటి బెనిఫిట్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీలకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని,ఐసిడిఎస్ బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలని కోరారు.2017 నుండి పెండింగ్లో ఉన్న టిఏడిఏ లను వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.2018లో కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు 1500 హెల్పర్లకు 750 మినీ వర్కర్లకు 1250 రూపాయలను దానికి సరిపడ బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు.పెండింగ్ ఉన్న అన్నీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.సీనియార్టీని బట్టి వేతనంలో వ్యత్యాసం ఉండాలని,ఇంక్రిమెంట్ సౌకర్యం కల్పించాలని చెప్పారు.ఐసిడిఎస్ కి సంబంధంలేని పనులను చేయించరాదని మినీ అంగన్వాడి సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించి ప్రకటించిన సర్కులర్ ఇవ్వాలనీ కోరారు.అంగన్వాడి ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలని ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలలో వేసవి సెలవులు ఇవ్వాలని తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని అన్నారు.అందుకే సమ్మె బాటపట్టామని పేర్కొన్నారు.ఈ సమస్యలు పరిష్కరించాలని అంతవరకు సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పద్మ, వైధేవి,సుమతమ్మ,వరలక్ష్మి, యాదమ్మ,జ్యోతి,జయమ్మ,లక్ష్మి,విజయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply