Take a fresh look at your lifestyle.

శమయతే పాపం. . .శమీ వృక్ష ప్రత్యేకత

శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశినీ, అర్జునస్య ధనుర్థారీ, రామస్య ప్రియదర్శినీ, ‘ …భారత, రామాయణాది పౌరాణిక గాధలలో శమీ వృక్షానికి విశేష ఫ్రాధాన్యత కల్పించ బడింది. శమీకే ‘‘అపరాజిత ‘‘ అనిపేరు. అంటే ఓటమి నెరుగని మాతయని అర్థం. అమెయే విజయ, నామాంకితయైన జగజ్జనని, అపరాజితా దేవి. విజయానికి అధిదేవత.

శరన్నవరా త్రి వేడుకలలో భాగంగా, దుర్గా మాతను తొ మ్మిది రోజులుగా కొలిచి నట్లయితే సర్వ శక్తులు సమకూరి, విజయ దశమినాడు విజయం చేకూర గలదని భక్తుల, ఆధ్యాత్మిక కార్యానురక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులకై దసరా నవరాత్రి ఉత్సవాలలో ముగింపుగా విజయ దశమి పర్వ దినాన శమీ (జమ్ని) వృక్షాన్ని పూజించి, సర్వాభీష్ట నిద్దికై ప్రార్శించడం ప్రాచీన కాలంనుండి అనుసరిస్తున్న సత్సాంప్రదాయం. పూర్వకాలంలో రాజులు తమ విజయ యాత్ర సన్నాహక కార్యక్రమాలుగా ‘ ‘ అగ్నిపూజ, గుర్రాలు , ఏనుగులు ‘ ‘ మొదలైన వాటికి కొన్ని ఆర్చనలు చేయడాన్ని ఆచరించారు. దానిలో భాగంగానే శమీవృక్ష పూజ చేసి, యుద్దానికి వెళ్ళేవారు. సంబంధిత కొన్ని విశేషాలను కాళిదాసు రఘువంశ మహా కావ్యమందు నాలుగవ సర్గలో సూచించారు. యజ్ఞ యాగాదులలో ఉపయుక్త శ్రౌతాగ్నిని మధించుటకై , జమ్మి కొమ్మ అవసరమైంది. అరనులలో ఆడుగు కర్ర జమ్మికర్ర. పై కర్ర రావి కర్ర వాడతారు. జమ్మిని స్త్రీ లింగం గా, రావిని పుం లింగంగా ( శమింతా, అశ్వత్ధ:) అని ఆర్యులు పేర్కొన్నారు. అగ్ని శమీ గర్బాన కలదని ( శమీ గర్భా దగ్నిం మంద తి) అని శ్రుతి వచనం, కనుకనే శమీ పూజకు ప్రాధాన్యత ఏర్పడింది. విజయ దశమి నాడు శమీవృక్షాన్ని పూజించే క్రమంలో రామార్జున గాధలను స్మరించే సంప్రదాయం ఉంది. రాముడు , రావణునిపై విజయం సాధించిన దినంగా , పాండవులు వనవాసం వెళుతూ, శమీవృక్షం పైనుండి తమ ఆయుధాలను తిరిగి పొంది కౌరవులను జయించిన దినంగా విజయ దశమికి ప్రత్యేకత ఉంది. అర్జునినితో కూడిన పాండవులు అజ్ఞాత వాసం వెళ్ళే సమయాన తమ అస్ర శస్త్రాలను శమీ వృక్షంపై నిక్షేపించినట్లు భారత కథనం. శమీవృక్షం లేదా జమ్మి చెట్టు లను మాగ్నోలియో పైటా తరగతికి, ప్రోసో పిస్‌ ‌జాతికి , ఫాబేసి కుటుంబానికి చెందినది. దీని శా స్త్రీయ నామం ప్రోసోపిస్‌ ‌సైసిజెరా. వైదిక భాషలో ‘‘ఆరణి’’ అని పిలుస్తారు. అగ్నిని ఉద్భవిం చేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువు అని ‘‘ఆరణి’’ ‘ ఆర్థం.

జమ్మి ఆకుల పసరు తీసి, పుళ్లకు రాస్తే కుష్టు వ్యాధి నశిస్తుందని, జమ్మి పూలను చక్కెరతో కలిపి సేవించడం వల్ల గర్భ స్రావం కాకుండా నిరోధించ బడుతుందని , జమ్మి చెట్టు బెరడు దగ్గు ఆస్తమా వ్యాధులకు ఔషధంగా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెపుతారు. విజయ దశమి సాయంత్రం శమీవృక్షం వద్ద ఆపరా జితను పూజించి ‘‘శమీ శమయతే పాపం శమీ లోహిత కంటకా, ధారిణ్య అర్జున బాణానాం రామస్య ప్రియ వాదినీ , కరిష్యమాణ యాత్రాయాం యథా కాలం సుఖం మయా , తత్ర నిర్విఘ్న కర్తీత్వం భవ శ్రీరామ పూజితే,’’ అని చిట్నీలపై రాని జమ్మి చెట్టు కొమ్మలకు తగిలిస్తే, దీని వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కాగలదని విశ్వాసం. మహారాష్ట్రులు శమీ వృక్షానికి తోడు పలాశ (మోదుగ) పత్ర పూజా చేస్తారు. హిందువుల శుభాశుభ కర్మలలో మోదుగ ప్రమేయం అధికం. ఉపనయనాలో వటువులు భిక్షా సమయాన ధరించేది పలాశ దండం, కాశీకి వెళ్ళి వచ్చిన నైష్టీకులు మోదుగ ఆకుల విస్తళ్ళలో నే భోజనం చేసే వారు. పలా శప త్రాలను పోలిన బంగారు చిన్నచిన్న ఆకులను చేయించి , దేవు శృకు , స్నేహితులకు , బంధువులకు ఇవ్వడం విజయ దశమినాటి మహా రాష్ట్ర ప్రజల ఆచారం.

– రామ కిష్టయ్య సంగన భట్ల…

9440595494

Leave a Reply