ఎల్‌ఆర్‌ఎస్ చీకటి జిఓను ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…30 నుండి 40 సంవత్సరాల లేఔట్‌లను కూడా రెగ్యులరైజ్ చేసుకోవలంటుందని ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకోవాలని కేసీఆర్, కేటీఆర్ పేపర్ లో కూడా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. తాను ఎల్‌ఆర్‌ఎస్ పైన హైకోర్టులో పి•ల్ దాఖలు చేశానని ప్రభుత్వాని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్ పేరు మీద కేవలం రంగారెడ్డి జిల్లాలోనే లక్ష కోట్లు వస్తాయని కేసీఆర్, కేటీఆర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ పేరు మీద 3 లక్షల కోట్లు దండుకోవాలని ప్రభుత్వం చూస్తుందని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, న్యాయం కోసం సుప్రీమ్‌కోర్టుకు వెళ్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు.