Take a fresh look at your lifestyle.

ఐదురోజుల్లోనే భ్రమణం పూర్తి చేస్తున్న గ్రహం

కొత్త గ్రహాన్ని కనుగొన్న  క్వీన్‌లాండ్స్ ‌పరిశోధకులు
న్యూదిల్లీ,జనవరి4: సంవత్సర కాలం పూర్తయిన తరువాత తెలుగునామ సంవత్సరం ‘ ఉగాది ’ వస్తుంది. అంతా ఎంతో ఉత్సాహంగా ఉగాది పండుగ చేసుకుంటారు. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 365 రోజులు 5 గంటలు 59 నిమిషాలు 16 సెకండ్లు పడుతుంది. ఇలా ఒక భ్రమణం పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం పూర్తవుతుంది. మళ్లీ భ్రమణం మొదలైనపుడు ఉగాది పర్వదినంగా జరుపుకుంటారు. కానీ ఓ గ్రహానికి ఐదు రోజులకోసారి ఉగాది వస్తుంది..! ఇది ఓ కొత్తగ్రహంలో జరిగే తంతు. ఈ కొత్త గ్రహాన్ని సదరన్‌ ‌క్వీన్స్‌లాండ్‌ ‌విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లు కనుగొన్నారు. తాజాగా ఈ పరిశోధన వివరాలను జర్నల్‌లో ప్రచురించారు.

అమెరికాలోని నాసాకు చెందిన ట్రాన్సిటింగ్‌ ఎక్సోప్లానెట్‌ ‌సర్వే శాటిలైట్‌ అం‌దజేసిన సమాచారాన్ని వినియోగించుకుని ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గ్రహం 1.95 బిలియన్‌ ‌సంవత్సరాల పూర్వం నుంచి ఉంది… సదరన్‌ ‌క్వీన్స్‌లాండ్‌ ‌విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లు ఈ కొత్త గ్రహాన్ని గుర్తించారు. ఈ గ్రహం కేవలం ఐదు రోజుల్లోనే నక్షత్రం చుట్టూ ఒకసారి భ్రమణం పూర్తి చేస్తున్నట్లు తెలుసుకున్నారు.

అంటే ఈ గ్రహంలో ఒక సంవత్సరం అంటే మనకు ఐదు రోజులు అన్నమాట ! గురు గ్రహం కన్నా మూడు రెట్లు పెద్దదైన ఈ కొత్త గ్రహం మన భూమికి దాదాపు 530 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది వేగంగా తిరుగుతున్న మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోందని పేర్కొన్నారు. ఇది 1.95 బిలియన్‌ ‌సంవత్సరాల పూర్వం నుంచి ఉందని అంచనా వేశారు. దీని ఉపరితల ఉష్ణోగ్రత 6,700 నుంచి 6,800 కెల్విన్‌ ‌వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు.

Leave a Reply