డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్
కొత్తగూడెం, ప్రజాతంత్ర, జనవరి 4 : ప్రజాతంత్ర నూతన సంవత్సర2023 క్యాలెండర్ తోపాటు డైరీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ25 సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను ప్రభుతం దృష్టికి తీసుకొచ్చే క్రమంలో చేస్తున్న అక్షర ప్రస్థానాన్ని అభినందించారు. సంపాదకుని భావనలకు ప్రాధాన్యత ఇచ్చేలా కాకుండా ప్రజా ప్రయోజనాలను కాపాడేలా పత్రికలు పని చేయాలని తెలిపారు.
పరిశోధనాత్మక కథనాలతో మరిన్ని అవినీతి అక్రమాలను వెలికితీయాలని, విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి మేలు చేస్తుందని అన్నారు. వార్తాస్రవంతిలో పారదర్శకతను పాటిస్తూ సమస్యలను అక్షర రూపంలో ప్రతిబింబించేలా కథనాలు రాస్తూ పత్రికారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని కనబరుస్తోందన్నారు. యాజమాన్యానికి, విలేఖరులను అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర ప్రతినిధి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.