Take a fresh look at your lifestyle.

ఏపీలో ఉచిత ఎంసెట్‌ ‌మాక్‌ ‌పరీక్ష

అమరావతి: ఎంసెట్‌ ‌పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్‌లైన్‌లో ఉచిత ఎంసెట్‌ ‌మాక్‌ ‌టెస్ట్ ‌నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ‌తెలిపారు. ఈ మేరకు సోమవారం మాక్‌ ‌టెస్ట్ ‌వివరాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్‌ ‌సొసైటీ ఆఫ్‌ ఇం‌డియా సంస్థ ఈ నెల 19న మాక్‌ ‌టెస్ట్‌ను నిర్వహిస్తుందన్నారు. ఎంసెట్‌ ‌మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు.మరుసటి రోజున ఫలితాలు వెల్లడిస్తారన్నారు.

ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ కృషి చేయాలో తెలుపుతారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎంసెట్‌ ‌మాక్‌ ‌పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు  www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in  లలో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Leave a Reply