Take a fresh look at your lifestyle.

ఆ ‌రాష్ట్రాల్లోనే లక్షకన్నా ఎక్కువ కేసులు

కొరోనాపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్రమంత్రి హర్షవర్ధన్‌
కొరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ‌తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, ‌ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ‌బీహార్‌, ‌తెలంగాణ, ఒడిశా, అస్సాం, కేరళ, గుజరాత్‌లోనే నిర్దారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ‌లోక్‌సభకు తెలిపారు. కొరోనాపై చర్చ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో లక్షకుపైగా పాజిటివ్‌ ‌కేసులు నిర్దారణ అయ్యాయని చెప్పారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో దేశంలో మిలియన్‌ ‌జనాభాకు 3,328 కేసులు నిర్దారణ అవుతున్నాయని, అలాగే మిలియన్‌కు 55 మరణాలకు మాత్రమే పరిమితం చేయగలిగామన్నారు. కొరోనా మరణాల రేటు 1.6శాతం మాత్రమే ఉందని, బాధిత దేశాలతో పోలిస్తే ప్రపంచంలో అతి తక్కువ సంఖ్యలో ఉందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌విధించడం వల్ల కొరోనా ఉధృతిని నిరోధించడంలో సహాయపడిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వైరస్‌ ‌ప్రబలినప్పటి నుంచి దవాఖానల్లో 36.3 రెట్లు బెడ్లు, 24.6 రెట్లు ఐసీయూ బెడ్స్ ‌పెరిగాయని తెలిపారు. వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌కు ముందు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. కొరోనా వైరస్‌ ‌కట్టడికి విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీని మంత్రి ప్రశంసించడంపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

Leave a Reply