Take a fresh look at your lifestyle.

సామాన్యునికి కలిసిరాని 2023..!

2023 సంవత్సరానికి ఈ రోజు ఆఖరి రోజు ..   చంద్రమండలం పై త్రివర్ణ పతాకం రెపరెప లాడడం మినహా ..దేశంలో  పెద్దగా మాయలు, మంత్రాలు జరగలేదు … యధారాజా తథా ప్రజా అన్నచందంగా సాగింది. దేశం పెద్దగా ఏ రంగంలోనూ అభివృద్దిని చూడలేదు. అయితే ధరలదాడి ఈ యేడాది కూడా సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేసింది. బియ్యం,కూరగాయలు,ఉల్లిపాయల ధరలు అమాంతంగా పెరిగాయి. ధలను కంట్రోల్‌ చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అవుతున్నాయి. ఓ వైపు కుప్పలు తెప్పలుగా ధాన్యం పండుతున్నా…ధరలుమాత్రం అందుబాటులో లేకపోవడం పాలకుల వైఫల్యాలకు పరాకాష్టగా మిగిలింది. పెట్రోల్‌ గ్యాస్‌, వంటనూనెల ధరలు దిగిరాలేదు. వ్యవసాయ చట్టాలు రద్దయినా రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. దేశంలో వనరులున్నా వాటిని ఉపయోగించు కోవడంలో విఫలం అవుతూనే ఉన్నాం. దిగుమతుల కారణంగా దేశంలో ధరలు తాండవిస్తున్నాయి. రూపాయి మారకం విలువ భారీగా పెరిగింది. దీంతో అమెరికాకు వెళ్లి చదవాలనుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారింది. ఇకపోతే నిరుద్యోగం బాగా పెరిగింది. బిజెపి రాజకీయంగా బలపడిరది. కాంగ్‌ఎస్‌లో మాత్రం కొత్త ఆశలు పుట్టుకు వస్తున్నాయి.

కార్పొరేట్‌ సంస్థలకు  బాగా కలసివస్తోంది. ఒక్కో సంస్థ వారి ఖాతాల్లో చేరుతోంది. ఆదానీ, అంబానీల సంపద అనూహ్యంగా పెరిగింది. ప్రజల సగటు ఆదాయం పడిపోయింది. ధరలను అదుపుచేసే విషయంలో ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. విద్యా, వైద్య రంగం ఖరీదైన సరకుగా మారింది. అలాగే మాటలగారడీతో మభ్య పెడుతున్న ప్రధాని  మోదీ పైన  ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. పదేళ్లలో మోదీ సర్కార్‌ సాధించిన అభివృద్ధిపై ఇప్పటికే చాలా చర్చ జరిగింది. స్మార్ట్‌ సిటీలనుంచి మేక్‌ ఇన్‌ ఇండియాల వరకూ, అవినీతి నుంచి నల్లధనం నిర్మూలన వరకూ, అచ్చేదిన్‌ నుంచి సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌ వంటి నినాదాల వరకూ మోదీ అద్భుత ఫలితాలు సాధించి ఉంటే గనుక దేశ పరిస్థితులు మరోలా ఉండేవి. ఇవన్నీ పోయి ఇప్పుడు ఆత్మనిర్భరభారత్‌ నినాదం వచ్చింది. నినాదాలే తప్ప జనానికి ఒరిగేదేవిూ కనిపించడం లేదు. మోదీ నినాదాలపైనా ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లుతోంది. విపక్ష పార్టీలన్నీ జతకట్టి ముందుకు సాగినా ఏవిూ చేయలేని పరిస్థితికి మోదీ ఎదిగిపోయారు.

ఇప్పటికిప్పుడు మోదీ స్థానంలో బిజెపి నుంచి వివిధ పక్షాలు ఆమోదించగలిగిన మరో ప్రత్యామ్నాయ నేత రంగంలోకి వొస్తారనే ఆశలులేవు. మోదీ వైఖరి, స్వభావం, కక్షసాధింపు ధోరణి వల్ల ప్రతిపక్షాలే కాదు, స్వపక్షాలు కూడా ఆయనను వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడిరది.  మోదీ తీసుకున్న నోట్లరద్దు, జిఎస్టీ నిర్ణయాల వల్ల కలిగిన దుష్పరిణా మాలను ప్రజలు ఇంకా అనుభవిస్తుంటే, దాంతో దేశానికి మేలు జరిగిందననే బూటకపు  ప్రచారం చేసుకుంటున్నారు. ఇది కూడా ప్రజల్లోనే కాకుండా స్వపక్షంలోనూ వ్యతిరేకత వొస్తోంది. అలాగే విపక్షాల్లో అనైక్యత కూడా  కి మోదీ కలసి వొస్తోంది. అలాగే అవి పాలిస్తున్న రాష్టాల్ల్రో కూడా పెద్దగా ప్రజాసంక్షేమం, అభివృద్ది కానరావడం లేదు.
దేశంలో సమస్యలను పరిష్కరించడంలో రాజకీయ నాయకులు విఫలం కావడం వల్లనే దేశం ఎప్పుడూ అస్థిరంగా మారుతోంది. అత్యధిక మెజారిటీతో బిజెపిని ప్రజలు రెండుసార్లు ఎన్నుకున్నప్పటికీ దేశంలో స్థిరత్వం సాధించడంలో, వివిధ రాష్టాల్రను, ముఖ్యమంత్రులను, మెప్పించడంలో, అందరికీ ప్రయోజనకరమైన విధానాలను అమలు చేయడంలో మోదీ విఫలం అయ్యారు.  ముఖ్యంగా దేశాన్ని ఒకే తాటిపైకి తేవడంలో సఫలం కాలేకపోతున్నారు. అందుకు కావల్సిన సామరస్య దృక్పథాన్ని అనుసరించే బదులు ఆధిపత్య ధోరణిని అనుసరిస్తున్నారు. అధికారమే ధ్యేయంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులను నాశనం చేయడం లక్ష్యంగా పనులు చేస్తున్నారు.

ఉమ్మడి కార్యక్రమం ద్వారా, ఒకే ఎన్నికల గుర్తింపు ద్వారా,  ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలన్న సంకల్పం కూడా కానరావడం లేదు. అందుకే విపక్ష శిబిరంలో పెద్దగా కదలిక చూపడం లేదు. ఉచిత పథకాలను, డబ్బులు పంపిణీని అభివృద్దిగా చూపుతూ పేదలను పేదలుగా మారుస్తున్నారు. వారికి పనిచేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఉపాధి రంగాలను అభివృద్ది చేయ లేకపోతున్నారు. నేతల్లో కొత్త ఆలోచనలు రావడం లేదు. మూసపద్దతిలో సాగుతున్న పాలన కారణంగా ఈ నేతలతో నవీన భారత నిర్మాణం అసాధ్యమని చెప్పకతప్పదు. ప్రజలు ఆశిస్తున్న మార్పు కొత్త ఏడాదిలో అయినా కనిపిస్తాయన్న ఆశ లేదు. పాలనలో మార్పు రావాలి. ప్రజలకు డబ్బులు పందేరం చేసి వోట్లు దండుకునే విధానాలు పోవాలి. ప్రజలు కూడా డబ్బులకు ఆశపడినన్ని రోజులు బతుకులు బాగపడవని గుర్తించాలి. వోట్లవేటలో దేశాన్ని కుదేలు చేస్తున్నా రాజకీయ పార్టీలకు సమాధి కట్టాలి. ఈ సంవత్సం అంతా ఇక ఎన్నికల సమా సంవత్సరమే. మరోమారు బురిడీ కొట్టించే మాటలకు లొంగితే మరో ఐదేళ్లు బేలగా బతకాల్సిందే ..!
 `ప్రజాతంత్ర డెస్క్‌ 

Leave a Reply