Take a fresh look at your lifestyle.

సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30:  ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.  శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్  7 గుడుపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో  ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారెంటీలను అర్హులైన పేద ప్రజలకు అందించేందుకు జిల్లాలోని అన్ని గ్రామాలు మున్సిపల్ వార్డులలో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల ద్వారా దరఖాస్తు రూపంలో స్వీకరించి నిస్సహాయులకు లబ్ధి చేకూర్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తులను జనవరి 6వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని, ఒకటే దరఖాస్తు అన్ని స్కీం లకు వర్తిస్తుందని తెలిపారు.  దరఖాస్తు ఫారాలను తప్పులు లేకుండా సక్రమంగా నింపాలని, దరఖాస్తులు నింపరాని వారి కోసం గ్రామసభల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సహకరించాలని సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచడం జరుగుతుందన్నారు.  ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని 10 లక్షలకు పెంపు హామీలను అమలు చేయడం జరిగిందని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో వికారాబాద్  మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

Leave a Reply