Take a fresh look at your lifestyle.

ఆగస్టులో 14 రోజులు బ్యాంకులకు సెలవు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 : వొచ్చే ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉన్నాయి. ఆర్బీఐ క్యాలెండర్‌ ‌ప్రకారం ఆగస్టులో పండుగలు, పర్వదినాలు, వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక దినోత్సవాలతోపాటు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలను కలుపుకొంటే 14 రోజులు బ్యాంకులు బంద్‌. ‌

కాబట్టి వొచ్చే నెలలో బ్యాంకు పనులకు ప్రణాళిక వేసుకున్న ఖాతాదారులు ఇందుకు అనుగుణంగా ప్లాన్‌ ‌చేసుకోవాల్సిన అవసరముంది. బ్యాంకులు మూసేసినా ఇంటెర్నెట్‌ ‌బ్యాంకింగ్‌, ‌యూపీఐ సేవలు నిరంతరం అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ,  ప్రత్యేకించి బ్యాంకు బ్రాంచిలలోనే పూర్తి చేసుకోవాల్సిన కొన్ని పనులకు అవాంతరాలు కలిగే అవకాశం ఉంది.

Leave a Reply