Take a fresh look at your lifestyle.

తండ్రిని చంపిన తనయుడు.. సహకరించినా తల్లి..

షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం గుండాల గ్రామంలో  తండ్రిని చంపి పాతిపెట్టిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీనికి తల్లి సహకరించింది ఈ దారుణ సంఘటనతో గుండాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి కుమారుడే తండ్రిని కిరాతకంగా అంతమొందించాడు అతని పొలంలోనే పాతిపెట్టి చేతులు దులుపుకున్నాడు కన్నతండ్రిని కసాయి కొడుకు కిరాతకంగా చంపేసి సొంత పొలంలో పాతిపెట్టిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నెలరోజులుగా తండ్రి కనిపించకపోవడంతో బంధువులు కొడుకుని గట్టిగా నిలదీయడంతో దారుణం వెలుగుచూసింది తండ్రిని తానే తల్లితో కలసి హత్య చేసినట్లు చెప్పడంతో షాక్‌కి గురయ్యారు కుటుంబ సభ్యులు గుండాల మండలానికి చెందిన ఎస్ కిష్టయ్య నెల రోజుల నుంచి కనిపించకుండా పోయాడు అతని కోసం బంధువులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి కిష్టయ్య కుమారుడిపై  అనుమానం వచ్చిన బంధువులు అతన్ని  ప్రశ్నించడంతో దారుణం బయటపడింది తానే తల్లితో కలసి తండ్రిని చంపేశానని.. శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టినట్లు అంగీకరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు డెడ్ బాడీని బయటికి తీసి పోస్ట్ మార్టం చేస్తున్న చేవెళ్ళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply