Take a fresh look at your lifestyle.

ఆశా వర్కర్లకు తెలంగాణలోనే అత్యధిక జీతాలు

  • మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడి
  • వన్‌ ‌నేషన్‌..‌వన్‌ ‌ఫ్రెండ్‌ : శ్రీ‌లంకలో అదానీ ప్రాజెక్టుపై మంత్రి వ్యంగ్యాస్త్రాలు

సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 6 : ఆశా వర్కర్లకు  అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగణయేనని మంత్రి కేటీఆర్‌  అన్నారు. ప్రధాని మోదీ  సొంత రాష్ట్రం గుజరాత్‌లో కంటే ఎక్కువగా వేతనాలు అందిస్తున్నామని అన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. సిరిసిల్లా  జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌.. ‌తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో నూతనంగా నిర్మించిన ప్లలె దవాఖానను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

ప్లలె దవాఖాన, బస్తీ దవాఖాన, హెల్త్ ‌ప్గ్రొల్‌, ఉచిత డయాగ్నసిస్‌ ‌సేవలు, కేసీఆర్‌ ‌కిట్‌ ‌వంటి కార్యక్రమాలు అమలవుతు న్నాయని వెల్లడించారు. అంతకుముందు జిల్లెల్ల ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ ‌క్లాస్‌రూమ్‌, ‌సోలార్‌ ‌ప్లాంట్‌ను ప్రారంభించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన సైన్స్ ‌ఫెయిర్‌ను తిలకించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారు రూపొందించిన ప్రాజెక్టులను గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత సిరిసిల్ల పట్టణంలో నిర్మించిన షాదీఖానను ప్రారంభించారు.

వన్‌ ‌నేషన్‌..‌వన్‌ ‌ఫ్రెండ్‌ : శ్రీ‌లంకలో అదానీ ప్రాజెక్టుపై కెటిఆర్‌ ‌వ్యంగ్యాస్త్రాలు
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి నిప్పులు చెరిగారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టుపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ‘ఎ మ్రి ‌కాల్‌లో ’వన్‌ ‌నేషన్‌.. ‌వన్‌ ‌ఫ్రెండ్‌ (ఒకే దేశం.. ఒకే మిత్రుడు)’ అనేది కొత్త పథకమని వ్యాఖ్యానించారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టును ఆ దేశ ఆర్థిక మంత్రి ‘ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం’గా అభివర్ణించారు.

ఈ మేరకు పత్రికల్లో వొచ్చిన పత్రికా క్లిప్పింగ్స్‌ను ట్విటర్‌లో షేర్‌ ‌చేస్తూ మంత్రి కేటీఆర్‌ ‌కామెంట్స్ ‌చేశారు. అదానీకి ప్రాజెక్టును కట్టబెట్టాలంటూ ప్రధాని మోదీ తమను బలవంత పెట్టారని గతంలో శ్రీలంక చేసిన వ్యాఖ్యలను కూడా మంత్రి గుర్తుచేశారు. నరేంద్రమోదీ సర్కారు తమ పాలనా కాలాన్ని అమృత కాలమని చెప్పు కోవడం, వన్‌ ‌నేషన్‌..‌వన్‌ ‌పెన్షన్‌, ‌వన్‌ ‌నేషన్‌..‌వన్‌ ‌రేషన్‌కార్డ్ ‌లాంటి పథకాలను తీసురావడాన్ని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్‌ ‌తనదైన శైలిలో ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమృత కాలాన్ని ఎ మ్రి ‌కాల్‌గా కేటీఆర్‌ అభివర్ణించారు. వన్‌ ‌నేషన్‌ ..‌వన్‌ ‌ఫ్రెండ్‌ అనేది ఎ మ్రి ‌కాల్‌లో కొత్త పథకమని వ్యాఖ్యానించారు.

Leave a Reply