Take a fresh look at your lifestyle.

ధాన్యం కనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం దారుణం

  • రైతులను మోసం చేస్తున్న కెసిఆర్‌
  • ‌వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడం కెసిఆర్‌ ‌డ్రామా
  • రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కాంగ్రెస్‌ ‌కార్యాచరణ ఖరారు
  • జనవరి 18న రాష్ట్ర వ్యాప్త ఆందోళన

‌ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామన్న సీఎం కేసీఆర్‌ ‌ప్రకటన రైతులను అవమాన పర్చేలా ఉందని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. ఆ ప్రకటన నిజమైతే కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. సిఎం కెసిఆర్‌ ‌ప్రకటనపై గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ‌నేతలు అత్యవసరంగా సమావేశమ్యారు. భవిష్యత్‌ ‌కార్యాచరణపై చర్చించారు. ఉత్తమ్‌ ‌సమక్షంలో పార్టీ నేతలు భట్టి విక్రమార్క, జీవన్‌ ‌రెడ్డి, శ్రీధర్‌ ‌బాబు తదితరులు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఉత్తమ్‌ ‌మాట్లాడుతూ జనాభాలో 70 శాతం ఉన్న రైతుల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఎందుకు మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందని చెప్పడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను 2004లో కాంగ్రెస్‌ ‌ప్రారంభించిందని గుర్తుచేశారు. కొరోనా నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పిన అధికారులకు జ్ఞానం ఉండాలని వ్యాఖ్యానించారు. అన్ని విషయాల్లో టీఆర్‌ఎస్‌ ‌కేంద్రానికి మద్దతు ఇచ్చిందని ఉత్తమ్‌ ‌పేర్కొన్నారు. కేసీఆర్‌ అసమర్థత వల్ల పంట బీమా రద్దు అయిందని తెలిపారు.

- Advertisement -

30 నుంచి జనవరి 7 వరకు మండల కేంద్రాల్లో నిరసన తెలిపి తహశీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. జనవరి 11న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు ..కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. జనవరి 18న రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఉత్తమ్‌ ‌వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ ‌నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిందంతా డ్రామానే అని సీఎల్పీనేత భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ‌ముసుగు నిన్నటితో తొలగిపోయిందని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం బలమైన వ్యవస్థలను కూల్చే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఐకేపీ వ్యవస్థను మూసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. పీఏసీఎస్‌ను మూసేయలని చూస్తున్నారన్నారు. రైతులకు మద్దతు ధర రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం ముందు రాజ్యాంగాన్ని చదువుకోవాలని హితవు పలికారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. లాభ నష్టాలు చూసేది అసలు ప్రభుత్వమే కాదన్నారు. గుజరాతి వ్యాపారులకు రైతులను ఫణంగా పెట్టి కేంద్రం బిల్లులు తెచ్చిందని ఆక్షేపించారు. కేసీఆర్‌ అరాచకాలను ఆపుతాం, రైతుల పక్షాన పోరాడుతామని సీఎల్పీనేత భట్టివిక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్‌ ‌నిర్ణయంతో రైతులకు కనీస మద్ధతు ధర పొందే అవకాశం పోయిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్‌ ‌పతనానికి నాంది అని పేర్కొన్నారు. సీఎంగా కొనసాగే అర్హత కేసీఆర్‌కు లేదని విమర్శించారు. రైతులపై కేసీఆర్‌ ‌కపట ప్రేమ అర్ధమయిందన్నారు. రైతులకిచ్చిన హాలను నెరవేర్చడంలో ఘోరంగా ఫెయిలయ్యారని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను మోదీ వద్ద తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం ఈ చట్టాలను రద్దు చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply