Take a fresh look at your lifestyle.

గిరిపుత్రులకు ఆన్‌లైన్‌ ‌ద్వారా విద్యాభోదన

గిరిపుత్రులకు ఆన్‌లైన్‌ద్వారా విద్యాభోదన ఇంటి నుండే నేర్చుకునే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక దృష్టి సారించటం దానికి సంబంధించిన గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయులు చిత్తశుద్దితో పనిచేయవలసిన అవసరం ఉందని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్‌ ‌పొట్రూ అన్నారు. మంగళవారం నాడు ఐటిడిఏ పిఓ చాంబర్‌లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉమ్మడి జిల్లాల గిరిజన సంక్షేమ శాఖ ఎస్‌జిటిలు ఎల్‌ఇఎల్‌ ‌హెచ్‌యంలు విడుదల వారిగా ఆన్‌లైన్‌ ‌శిక్షణా కార్యక్రమాన్ని ప్రాజెక్టు అధికారి గౌతమ్‌ ‌పొట్రూ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ మరియు యంసి హెచ్‌ఆర్‌ ‌డి హైద్రాబాద్‌ ‌వారి ఆధ్వర్యంలో ఇన్‌స్టేటివ్‌ ‌శిక్షణకార్యక్రమాన్ని మూడు రోజుల పాటు ఏర్పాటు చేయటం జరిగిందని ఈ శిక్షణా కార్యక్రమం సంబంధించిన పానింగ్‌ ‌గత నాలుగు నెలలు మాత్రమే జరిగిందని దీనికి సంబంధించిన రిసోర్స్ ‌పర్సన్స్‌ను శిక్షణ మార్చి నెలలో భద్రాచలం వైటిసి నందు జరుగుతుందని , బేస్‌ ‌లెవెల్‌ ‌శిక్షణ పాఠశాల స్థాయి ఉధ్యాయులకు ఇవ్వవలసి ఉందని ఈ తరుణంలో కోవిడ్‌ 19 ‌కరోనాపై లాక్‌డౌన్‌ ‌కారణంగా శిక్షణ వాయిదా పడిందని తెలంగాణ ప్రభుత్వం యంసిహెచ్‌డి హైద్రాబాద్‌ ‌వారి సహకారంతో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మొట్టమొదటి సారిగా గిరిజన ఉపాధ్యాయులు వెబ్‌ ‌మోడ్‌ ఆన్‌లైన్‌•‌ట్రైనింగ్‌ ‌భద్రాచలం మరియు ఖమ్మం జిల్లా పరిధి ఉపాధ్యాయులకు అందించటం జరుగుతుందని అన్నారు.

ఈ శిక్షణలో పాల్గొనే ఉపాధ్యాయులకు తమ ఇండ్లలోనే ఉండి స్మార్ట్ ‌ఫోన్‌ ‌ద్వారా యంసిహెచ్‌ఆర్‌డి నుండి సిస్కో యాప్‌ ‌మరియు ఐడి ద్వారా మెయింటనింగ్‌ ‌పాస్‌వార్డు పొంది లాగిన్‌ అయి శిక్షణ తీసుకుంటున్నారు. ఇలా ప్రతీ బ్యాచ్‌కు వంద మంది ఉపాధ్యాయులు చొప్పున 663 మంది ఉపాధ్యాయులు పొందుతారు. ఈ శిక్షణ ప్రారంభ పరీక్ష ముగింపు పరీక్షలు ఆన్‌లైన్‌ ‌లోనే వ్రాయవలసి ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులు విరివిగా వంద శాతం ట్రైనింగ్‌ ‌పూర్తి చేసి తదుపరి తరగతి భోజన డిజిటల్‌ ‌భోదనలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హైద్రాబాద్‌ ‌నుండి మర్రి చెన్నారెడ్డ మానవ వనరులశిక్షణా కేంద్రం డైరెక్టర్‌ ‌బిపి ఆచార్య భద్రాచలం ఐటిడిఏ డిడి జహీరుద్దీన్‌, ఏటిడిఓ పియం ఆర్‌సి రమణయ్య, సంబంధిత ఉమ్మడి జిల్లాల ఎల్‌ఎఫ్‌ ‌హెచ్‌యంలు , ఎస్‌జిటిలు పాల్గొన్నారు.

Leave a Reply