Take a fresh look at your lifestyle.

ఉప్పల్ నుండి మల్లాపూర్, ఇసిఐఎల్ వరకు మెట్రోను విస్తరిస్తాం 

 బండారి లక్ష్మా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి 
జోరువానలో వియజయవంతగా  కేటీఆర్ రోడ్ షో 
ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 :   అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డి గెలుపునకు మద్దతుగా గురువారం సాయంత్రం  మల్లాపూర్ శివ హోటల్ వద్ద  జోరు వానలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎన్నికల ఇన్చార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్, కార్పొరేటర్లు శాంతి సాయిజెన్ శేఖర్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గొల్లూరి అంజయ్య, మరియు పలువురు డివిజన్ ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్బంగా..  ఉప్పల్ నుండి మల్లాపూర్, ఇసి ఐఎల్ వరకు మెట్రో ను విస్తరిస్తాం మని  ప్రజలకు హామీ ఇచ్చారు. మోడీ 1200 చేసిన గ్యాస్ సిలిండర్ ను 400 కె ,సౌభాగ్య లక్ష్మీ కింద అర్హులైన ప్రతి మహిళకు 3000 ఇస్తామనీ తెలిపారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే కరెంట్ ఇవ్వకుండా పవర్ హాలిడే ఆనాడు ఉండేదని  ఇదే మల్లాపూర్, చర్లపల్లి లో ఒకప్పుడు పవర్ హాలిడే ఉండేవని..  ఇవాళ పరిశ్రమలకు హాలిడేలు లేకుండా పరిశ్రమలను నడుస్తున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో 35 ప్లై ఓవర్ లు కట్టాంమని,  ఒక్కటీ మాత్రం  మోడీకి విడిచిపెడితే ఇప్పటికి పూర్తి చేయలేదన్నారు.మూసి నదినీ మరింత బాగు చేద్దామన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో డ్రైనేజి వ్యవస్థ ను మరింత మెరుగు పరిచి,  లక్ష  డబుల్ బెడ్ రూమ్ లు కట్టి పేదలకు అందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని విజ్ఞప్తి చేశారు.   బండారి లక్ష్మారెడ్డి నాయకత్వంలో ఈరోజు అందరూ సమిష్టిగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి , రాగిడి లక్ష్మారెడ్డి  సోమశేఖర్‌ రెడ్డి ,  కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన మీ అందరిని చూస్తుంటే ఏ పోటీ లేకుండానే ఎలక్షన్‌ అయిపోయినట్లుగా కనబడుతుంది.  గడిచిన ఐదు సంవత్సరాలలో ఉప్పల్‌ నియోజకవర్గంలో మంచినీళ్లు, రోడ్లు మరియు చెయ్యాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం.   ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. 30 తారీఖు మీరందరూ ఓటింగ్‌ లో పాల్గొని కారు గుర్తుకు ఓటేసి, అభ్యర్ధి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను.. మేము చేసిన అభివృద్ధి మీ కళ్లముందే స్కై వాక్‌ రూపంలో కనపడుతుంది.  మెట్రోని ఈసీఐఎల్‌ కాప్ర దాక తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా తీసుకెళ్తాము. డ్రైనేజీ వ్యవస్థని మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా తప్పకుండా చేస్తాము.  ఉప్పల్లో ఉండే పారిశ్రామిక వాడల వారందరికీ 24గంటలు కరెంట్‌ ఇవ్వడం వల్ల సంపూర్ణంగా ఉత్పత్తి జరుగుతుంది. వారికి ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు రూపొందించబోతున్నాం.. డిసెంబర్‌ 3 తర్వాత, కెసిఆర్‌  ముఖ్యమంత్రి అయిన తర్వాత, నాలుగు కొత్త కార్యక్రమాలు మొదలు పెడుతున్నాము. అవన్నీ కూడా డిసెంబర్‌ 3 తారీకు తర్వాత లక్ష్మారెడ్డి  గెలిచాక ఆ కొత్త కార్యక్రమాలు మొదలు పెడతాము. మొదటిది సౌభాగ్య లక్ష్మి కార్యక్రమం. 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ నెలకు 3వేల రూపాయల భృతి ఇచ్చే కార్యక్రమం..అదేవిధంగా తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం.. కేసీఆర్‌ బీమా అనే కార్యక్రమం.  ఇవన్నీ గెలిచిన తర్వాత అమలు చేస్తాము. ఉప్పల్లో డెవలప్మెంట్‌ జరగాలన్నా, ఐటీ కంపెనీలు రావాలన్నా, మన రహదారులు బాగుపడాలన్నా, కెసిఆర్‌ నాయకత్వంలో బాగుపడతాయి తప్ప అల్లాటప్ప నాయకుల వల్ల కాదు…  30 వ తారీఖు నాడు తప్పకుండా ఓటింగ్లో పాల్గొనండి.. కారు గుర్తుకు ఓటెయ్యండి, భారీ మెజారిటీతో బండారి లక్ష్మారెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపించండి  రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, రక్షిత మంచినీరు, అన్నపూర్ణ పథకం, బస్తి దావఖానలు, అలాగే శాంతి భద్రతల పరిరక్షణ అంటే పథకాలు  పటిష్టంగా అమలు చేశామని  అన్నారు. అభివృద్ధి మరింత కొనసాగాలంటే బీ ఆర్‌ఎస్‌ పార్టీ ని బలపరిచి  గెలిపించాలని కోరారు.  నిరుద్యోగ యువతకు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్లు  మంత్రి చెప్పారు.ఉప్పల్ లి  బండారి లక్ష్మా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.

Leave a Reply