Take a fresh look at your lifestyle.

ప్రతి రైతు కూ రైతు బంధు..! : మంత్రి హరీష్ రావు

  • వానాకాలం లో రు.3500 కోట్లు విడుదల చేస్తాం: మంత్రి హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలతో సిద్దిపేట జిల్లా పెద్దలింగారెడ్డి పల్లి పల్లెకుంట చెరువు నిండటంతో గ్రామస్తులంతా.. జల నేత హరీశ్ రావుకు అడుగడుగునా పుష్పాలు చల్లుతూ.. బోనాలు, మంగళ హారతులు, కుంకుమ తిలకం దిద్దితూ స్వాగతం పలికారు.పెద్దలింగారెడ్డి పల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయుడి విగ్రహానికి కాళేశ్వరం-గోదావరి నీళ్ల బిందెలతో మంత్రి హరీశ్ రావు జాలాభిషేకం చేసారు.అనంతరం గ్రామ శివారులోని పల్లెకుంట చెరువులో గంగమ్మకు శాస్త్రోక్తంగా పూజలు జరిపి మంత్రి జలహారతి చేసారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..వానా కాలం రైతుబంధు రూ.3500 కోట్లు విడుదల చేయబోతున్నాం. ఏ ఒక్క రైతు మిగలకుండా ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు అందిస్తాం…అన్నారు. 25 వేల రూపాయల లోపు అప్పు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తూ., బ్యాంకులలో జమ చేస్తున్నాం.. సోమవారం బ్యాంకులకు వెళ్లి క్రాప్ లోను తెచ్చుకుని రుణాలు పొందాలని రైతులకు మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. 25 వేల నుంచి లక్షలోపు ఉన్న రైతులందరికీ నాలుగు దశల్లో రుణమాఫీ చేస్తామన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు రైతులపై ఎంతో వివక్ష చూపాయి..కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లతో.. పంటలు పండించాలంటే.. రైతులు బావులు, బోర్లు తవ్వించి అప్పుల పాలయ్యారు.ఏప్రిల్ నెలలో దేశ ధాన్యాగారంగా.. తెలంగాణ రాష్ట్రంగా ఎఫ్ సీఐ ఏండీ పేర్కొన్నారు…కానీ కాంగ్రెస్ పార్టీ నేత ఉత్తమ్ చారానా పంట కూడా కొనలేదని చెప్పడం సరి కాదు అన్నారు.దేశ వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నులు వరి పంట పండితే.. దాంట్లో 34 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రంలోపండినవే..కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలోని ఎఫ్ సీఐ ఏండీ నే ఈ విషయాన్ని ప్రకటించారు అని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలకు నీటితో నిండిన చెరువులే సమాధానం చెబుతాయని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు.

Leave a Reply