Take a fresh look at your lifestyle.

వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: పశువులకు కాలాను గుణంగా సంక్రమించే వ్యాధి నివారణ టీకాలను వేయించుకోవడంలో రైతులు నిర్లక్ష్యం చేయరాదని మండల పశువైద్యాధికారిని శ్వేత అన్నారు. మండల పరిధిలోని దౌలాపూర్ లో సోమవారం గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి వైద్యాధికారిణి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అందించే ఉచిత టీకాలను ప్రతి పాడి రైతు తమ పశువులకు విధిగా వేసుకోవాలన్నారు. వ్యాధి చికిత్స కంటే వ్యాధి నివారణే సులభమైన మార్గమని రైతులు గుర్తించాలన్నారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా కొనసాగుతున్న టీకాల కార్యక్రమాన్ని  రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఏ శ్రీనివాస్, ఓఎస్ హరిప్రసాద్, పాల కేంద్ర సేకరణదారులు ఇంద్రసేనారెడ్డి, నరేందర్ రెడ్డి,  గ్రామ రైతులు కృష్ణమూర్తి, వెంకట్ రెడ్డి, పెద్దులు, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply