Take a fresh look at your lifestyle.

హరీష్ రావుకు కుల సంఘాల మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: నంగునూరు మండలంలోని జేపితండా గ్రామస్తులంతా ,తిమ్మాయిపల్లి, భాషాగూడేం గ్రామంలో రెడ్డి, ముదిరాజ్, యాదవ, నాయిబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, ఎస్సీ కుల సంఘాల ఆధ్వర్యంలో  మంత్రి హరీష్ రావుకు మద్దతు తెలుపుతూ గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ తడిసిన ఉమా, రాష్ట్ర ఆయిల్ పామ్ వెల్ఫేర్ ఉపాధ్యక్షులు ఎడ్ల సోమిరెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జన హృదయ నేతకు ప్రజలు అడుగడుగునా జై కొడుతూ బ్రహ్మ రథం పడుతున్నారన్నారు. లక్షా యాబైవేల మెజారిటీ దిశగా మంత్రి హరీష్ రావుకే మా  మద్దతు అంటూ పలు కుల సంఘాలు ఏకగ్రీవాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామ ఐక్యత తో… ఏకతాటి ఫై కి వచ్చి ఏకగ్రీవ తీర్మానం ఇచ్చిన నంగునూర్ మండలంలోని పలు  గ్రామాలు… మా ఊరంతా బి ఆర్ ఎస్ పార్టీ కె… మంత్రి హరీష్ రావుకే మద్దతు అంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు లత-కృష్ణ, భిక్షపతి నాయక్, పిఏసిఎస్ చైర్మన్ ఎల్లంకి మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు వేముల వెంకట్ రెడ్డి, దువ్వల మల్లయ్య, మాజీ సర్పంచ్ మల్యాల నర్సింలు, మాజీ ఎంపిటిసి నర్సింలు, బీఆర్ఎస్ వీ మండల అధ్యక్షులు గోవిదారం రవి, బీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, నాయకులు రవి, శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply