Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొరోనా కేసులు 24 గంటల్లో

  • వైరస్‌ ‌బాధితులు..48,916 తాజాగా 757 మంది మృత్యువాత
  • రేపు మరోమారు సిఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

దేశంలో కొరోనా కేసులు, మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం…గత 24 గంటల్లో భారత్‌లో 48,916 మందికి కొత్తగా వైరస్‌ ‌సోకింది. అదే సమయంలో 757 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 13,36,861కి చేరగా, మరణాల సంఖ్య మొత్తం 31,358కి పెరిగింది. 4,56,071 మందికి హాస్పిటళ్లలో చికిత్స అందు తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కొరోనా నుంచి 8,49,431 మంది కోలు కున్నారు. కాగా, శుక్రవారం వరకు దేశంలో మొత్తం 1,58,49,068 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసిఎంఆర్‌) ‌తెలిపింది. ఒక్కరోజులో 4,20,898 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఇదిలావుంటే కొరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాధి నిర్దారణ పరీక్షలు గణనీయంగా పెంచాలని రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్‌మెంట్‌ ‌జోన్లపై శ్రద్ధ పెట్టాలని సూచించింది. కోవిడ్‌ ‌తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో పరిస్థితులపై కేబినెట్‌ ‌కార్యదర్శి రాజీవ్‌ ‌గౌబా శుక్రవారం ఉన్నత స్థాయిలో వర్చువల్‌గా సక్షించారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘టెస్ట్-‌ట్రాక్‌-‌ట్రీట్‌’ ‌వ్యూహంతో కొరోనాను నిలువరించడం సాధ్యమని గుర్తుచేశారు. ఇకపోతే కర్ణాటకలో శుక్రవారం కొత్తగా 5,007 కొరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 85,870కు పెరిగింది. గత 24 గంటల్లో 110 మంది కొరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,724కు చేరుకుంది. తమిళనాడులో శుక్రవారం 6,785 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 1,99,749కు చేరింది. మరో 88 మంది వైరస్‌ ‌కారణంగా మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 3,320కు పెరిగింది.

రేపు మరోమారు సిఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
‌కొరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించనున్నారు. ఈ సమావేశం రేపు జరుగుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత కాలంలో దేశంలో కొరోనా ఉధృతితో పాటు 3.0 అన్‌లాక్‌ ‌పరిస్థితులపై కూడా కూలంకశంగా చర్చించనున్నారు. వైరస్‌ ‌తీవ్రత, లాక్‌డౌన్‌ ‌మొదలవగానే ప్రధాని మోదీ మార్చి మాసంలో మొట్ట మొదటి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. జూన్‌ 16, 17 ‌తేదీల్లో వరుసగా రెండు రోజులు సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కొరోనా తీవ్రత, ఆయా రాష్ట్రాలు చేపడుతున్న చర్యలతో పాటు లాక్‌డౌన్‌ ‌సడలించిన తర్వాతి పరిస్థితులపై సీఎంలతో మోదీ చర్చించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 49 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. అంతేకాకుండా దేశంలో త్వరలోనే రోజు లక్ష కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సోమవారం జరగబోయే వీడియో కాన్ఫెరెన్స్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. దేశంలో ఐసీయూ పడలకు, వెంటిలేటర్ల కొరత తీవ్రగా ఉన్న నేపథ్యంలో…ఈ అంశాలు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. మరోవైపు టెస్టుల సంఖ్య పెంచాలని, హాస్పిటళ్లలో వసతులు పెంచాలని ఇప్పటికే కేంద్రం సూచించింది. 27న జరిగే సమావేశంలో ప్రధాని ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారన్నది చూడాలి.

Leave a Reply

error: Content is protected !!