Take a fresh look at your lifestyle.

 నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా 

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: చంపాపేట్ డివిజన్ పరిధిలోని గతంలో పలు కాలనీలలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రూ.6 కోట్ల 80 లక్షల తో పలు అభివృద్ధి పనులు మంజూరు చేశారు. అందులో భాగంగా శుక్రవారం  పలు శంకుస్థాపన కార్యక్రమంలో  ఎల్.బి.నగర్  శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  హాజరై శంకుస్థాపనలు చేశారు. దానిలో భాగంగా యాదగిరి నగర్‌ కాలనీలో వీ.డీ.సీ.సీ.రోడ్లకు,  చంపాపేట్ ఎస్సీ స్మశాన వాటికలో మరమ్మతులు, అభివృద్ధి పనులు(వెయిటింగ్ హాల్,మరుగుదొడ్లు,సీ.సీ.రోడ్లు,కెర్బింగ్ మొదలైనవి) ఫిక్సింగ్ సబ్‌మెర్సిబుల్ పంపు సెట్స్, చంపాపేట్‌లోని  కుమ్మరి బస్తి కమ్యూనిటీ హాల్ (జీ +1) నిర్మాణం,కటికొని కుంట యూ.జీ.డి.పైప్ లైన్ పునరుద్ధరణ,నెహ్రూ నగర్ కాలనీ, కటికోనికుంట నందు అంతర్గత లైన్లు, సీ.సీ.రోడ్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆలాగే సామ సరస్వతి కాలనీలో సీ.సీ.రోడ్డు పునరుద్ధరణ,న్యూ పద్మానగర్,బైరామల్‌గూడలోని ప్రగతి నగర్  దుర్గా భవానీ నగర్ వద్ద బాగా దెబ్బతిన్న సీ.సీ.రోడ్ల పునరుద్ధరణ,శ్రీనిధి కాలనీ నందు ఎస్.సీ.గ్రేవీ యార్డ్,మాధవ నగర్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన, బైరామల్ గూడా విలేజ్ నందు యూ.జీ.డి.పైప్ లైన్స్ పునరు ద్ధరణ,అంబేద్కర్ వాడ నందు యూ.జీ.డి.పైప్ లైన్ పునరు ద్దరణ,సీతారాం నగర్ యూ.జీ.డి.పైప్ లైన్ పునరు ద్ధరణ, ప్రగతి నగర్ యూ.జీ.డి. పైప్ లైన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని  చెప్పారు .నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. వేల కోట్ల రూపాయలతో  నియోజకవర్గన్నీ అభివృద్ధి చేసి ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరుగు తుందని అన్నారు. కార్యక్ర మంలో  కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ నల్ల రఘుమారెడ్డి,సీనియర్ నాయకులు సుంకోజు కృష్ణమాచారి,ఓరుగంటి వెంకటేష్,డివిజన్ అధ్యక్షులు రాజిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు రోజారెడ్డి,,డివిజన్ పరిధిలోని పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు,పలు విభాగాల కమిటీ సభ్యులు,మహిళలు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు,వివిధ కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply