సీఎం పరిశీలనలో సహాయక ప్యాకేజీ అంశం: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్, మే 7 ( ప్రజాతంత్ర ప్రతినిధి) : జర్నలిస్టులను అన్ని విధాలా అదుకుముంటామని రాష్ట్ర ఆబ్కారీ క్రీడలు.పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.గురువారం జిల్లాకేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు దండు దత్తు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు..ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పనిని బట్టి ఫలితం ఉంటుందని.మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు..నేను కూడా జర్నలిస్టుగా పనిచేశాను అని.వారి బాధలు దగ్గరుండి చూశామని అన్నారు .కరోన నేపథ్యంలో మహబూబ్ నగర్ ప్రజల కోసం నిద్ర లేకుండా కష్ట పడి పని చేశానని తెలిపారు చివరికి తల్లిదండ్రులకు కుటుంబానికి దూరంగాఉన్నానని చెప్పారు..ఆ కష్టం ఫలితంగానే ప్రజలు కరోన నుండి విముక్తి అయ్యారని చెప్పారు..
ఏ ఆపద వచ్చినా జర్నలిస్టులకు అండగా ఉంటా నని చెప్పారు.త్వరలో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.జర్నలిస్టుల అంటే ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని నిజాలు రాయాలని సూచించారుజర్నలిస్టులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సముఖంగా ఉన్నారని.మీ సమస్యలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి చెప్పారు. మంచి ప్యాకేజీ అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు, టియూడబ్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరసత్ ఆలీ మాట్లాడుతూ కేరళ.తమిళ్ నాడుతరహాలో జర్నలిస్టులను ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.రాష్ట్ర కార్యదర్శి పేపర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు..ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని కోరారు..ఈ కార్యక్రమంకు టియూడబ్యూజె జిల్లా అధ్యక్షుడు దత్తు అధ్యక్షతవహించగా. మునిసిపల్ చైర్మన్ నర్సింహులు. రైస్ మిల్ అధ్యక్షుడు అల్లంపల్లి మనోహర్. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సి.రాజేశ్వర్. రాష్ట్ర కార్య వర్గసభ్యులు వెంకటేష్..జిల్లా కార్యదర్శి శేఖర్.ఉపాధ్యక్షుడు బిజీ. రామాంజనేయులు.. రవి. చింత కాయల్ వెంకటేష్.తదితరులు పాల్గొన్నారు.