Take a fresh look at your lifestyle.

బాధితులతో ప్రేమగా మాట్లాడాలి

వైద్య సిబ్బందికి మంత్రి సూచన
హాస్పిటల్‌ ‌లో ఏ సమస్య, ఏ అవసరం ఉన్నా నన్ను సంప్రదించండి

కొరోనా క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్‌ ‌బాధితులకు మేమున్నామన్నా భరోసాను వైద్య సిబ్బంది కల్పించాలనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. కోవిడ్‌ ‌వార్డులలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తిరుగుతూ.. ప్రేమతో మాట్లాడుతూ.. బాధితులు త్వరగా వ్యాధిని జయించేలా చూడాలన్నారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల హాస్పిటల్‌లో కోవిడ్‌ ‌చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కొరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు రాష్ట్ర మంత్రి హరీష్‌రావు బుధవారం సాయంత్రం సందర్శించారు.

సుమారు 30 నిమిషాల పాటు ఐసియూలో తిరుగుతూ కోవిడ్‌ ‌పేషెంట్లున్న వార్డునులోనూ  అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి నేనున్నాననే భరోసాను ధైర్యాన్నిచ్చారు. నాకు కూడా కొరోనా  వచ్చిందని ….వైద్యుల సూచనలు పాటించి జయించానని తెలిపారు. పేషెంట్లలో ఆత్మస్థైర్యం నింపేందుకు..భరోసాను నింపేందుకు మంత్రి పిపిఈ కిట్‌ ‌లేకుండానే  బెడ్ల వద్దకు పోయి అందరి పేషెంట్లతో నేరుగా మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పేరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి దైర్యం చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధితులకు మేమున్ననామన్న భరోసా ను డాక్టర్లుగా కల్పించాలన్నారు. హాస్పిటల్‌లో ఏ సమస్య, ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాల మంత్రి వారికి సూచించారు. తనతో పాటు జిల్లా యంత్రాంగం సంపూర్ణంగా సహకారం అందిస్తామరనీ మంత్రి తెలిపారు.సందర్శనలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్‌  ‌వెంకట్రామ రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ‌డాక్టర్‌ ‌తమిళ అరుసు, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ‌మనోహర్‌, ‌డాక్టర్‌ ‌కాశీనాథ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply