Take a fresh look at your lifestyle.

పీపుల్స్ ‌పవర్‌…

వాళ్లెప్పుడు నిజాయితీకి
నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారనీ?

వాళ్లెన్నడు విలువలకు
ప్రతిబింబంగా ప్రభవించారనీ ?

ఎంతసేపు …
నమ్ముబలుకు ముచ్చట్లు
బహురూపు వేషాలు తప్పా !

ఒకవైపు కొరోనా దెబ్బకు
జనాలు పిట్టల్లా రాలుతుంటే
కర్ఫ్యూతో కాలయాపన తప్పా
కొరోనా కట్టడికి కాలు కదిపితిరా

వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ అం‌దక
గిలిగిలా తన్నుకు జీవిడిస్తుంటే

ఆత్మ నిబ్బర్‌….‌మన్‌ ‌కీ బాత్‌
‌పలుకులు వల్లెవేయడం తప్పా
అదుకున్న దాఖలాలున్నాయా ?

అంతిమక్రియకు చోటు కోసం
రోజుల తరబడి క్యూ కడుతుంటే…
శవ రాజకీయాలు చేయడం తప్పా
సమస్య సాధనకు ఉపక్రమించితిరా

వైరస్‌ ఎక్కడ వ్యాపిస్తుందోనని
జనం భయంతో వణుకుతుంటే
కుంభ మేళాకు భజన కీర్తనలు
ఎన్నికల ప్రచారార్భాటం తప్పా
నియంత్రణలకు పూనుకుంటిరా ?

ఇంకా నేతల నమ్మి నిమ్మకుంటే
కొరోనాకు మూల్యం చెల్లించాల్సిందే

అందుకే…
ముందుగా ఉపద్రవం నుంచి
ఎవరికివారు బయటపడదాం
అటు పిమ్మట దుష్ట పాలకులకు
పీపుల్స్ ‘‘‌పవర్‌’’ ఎం‌టో చూపిద్దాం

– కోడిగూటి తిరుపతి,, 9573929493

Leave a Reply