Take a fresh look at your lifestyle.

‌కోవిడ్‌ ‌పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం

  • వారికి తప్పనిసరిగా బెడ్లు అందించాలి
  • వైద్యంలో ఎక్కడా తేడా లేకుండా చూసుకోవాలి
  • ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలి
  • కోవిడ్‌ ‌నియంత్రణపై ఉన్నతస్థాయి సమీక్షలో సిఎం జగన్‌

కోవిడ్‌ ‌పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్‌ ‌పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని సూచించారు. ఎంప్యానెల్‌ ‌చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలన్నారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా, తప్పనిసరిగా చేర్చుకోవాలని అధికారులకు జగన్‌ ‌స్పష్టం చేశారు.  కోవిడ్‌ ‌నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌క్యాంప్‌ ‌కార్యాలయంలో సవి•క్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎం‌ప్యానెల్‌ ఆస్పత్రులూ ఆ బెడ్లను ఇవ్వాలని, అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ ‌చేయాలని సూచించారు. టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలని, కలెక్టర్లు నోట్గి• చేసిన నాన్‌ ఎం‌ప్యానెల్‌ ఆస్పత్రులూ ఆ బెడ్లు ఇవ్వాలని చెప్పారు.

కోవిడ్‌ ‌పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ మనం రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తున్నాము. మన రికార్డులను మనమే బద్ధలు కొడుతున్నాము. కోవిడ్‌ ‌చికిత్స కోసం అవసరం మేరకు బెడ్ల సంఖ్య మరింత పెంచండి. కోవిడ్‌ ‌చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలి. ఇందులో ఎక్కడా తేడా రాకూడదు.  అలా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులలో ఎన్ని బెడ్లు కోవిడ్‌ ‌రోగులకు ఉన్నాయన్న దానిపై మనకు పూర్తి స్పష్టత ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు అన్నింటిలో కలిపి కోవిడ్‌ ‌రోగులకు మొత్తం ఎన్ని బెడ్లు ఉన్నాయన్నది తెలుస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల బెడ్లు. ప్రైవేటు ఆస్పత్రుల బెడ్లు. ఎన్నెన్ని అన్నదానిపై స్పష్టత వస్తుందన్నారు. 104 కాల్‌ ‌సెంటర్‌కు ఫోన్‌ ‌వస్తే, ఆ రోగి ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఆ జిల్లాకు మెసేజ్‌ ‌వెళ్తుంది. వెంటనే కలెక్టర్‌, ‌జిల్లా యంత్రాంగం స్పందించి, ఆయా ఆస్పత్రులలో రోగులను చేర్పించాలి. ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలి. కోవిడ్‌ ‌రోగులకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు.

అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల వద్ద కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లు హ్యాంగర్లు పెట్టి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆస్పత్రి వైద్యులే అక్కడ కూడా సేవలందిస్తారు. అక్కడ అన్ని వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రులు. 349 కార్పొరేట్‌ ఎం‌ప్యానెల్‌ ఆస్పత్రులు. 47  కార్పొరేట్‌ ‌టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు. 94 ప్రైవేట్‌ ‌కేటగిరీ ఆస్పత్రులు.  ఆ విధంగా మొత్తం 598 ఆస్పత్రుల్లో 48,439 ఉండగా, వాటిలో 41,517 మంది చికిత్స పొందుతున్నారు. మరో 6922 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రులలో ఉన్న వారిలో 24,500 మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ ‌క్వాలిటీ, శానిటేషన్‌ ‌బాగుండాలి. ఎక్కడా ఏ లోపం లేకుండా ఉండాలి. శానిటేషన్‌, ‌క్వాలిటీ ఫుడ్‌, ‌డాక్టర్ల అందుబాటు, ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, ఆక్సీజన్‌.. ఈ 5 ‌మనకు చాలా ముఖ్యం. వైద్యులు లేకపోతే వెంటనే తాత్కాలికంగా అయినా నియామకాలు జరగాలి. ఆక్సీజన్‌ ‌సరఫరా, నిల్వలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదు.

ఎక్కడైనా అవసరం అయితే తగిన మరమ్మతులు చేయండి. కేంద్రం ఇంకా ఎక్కువ ఆక్సీజన్‌ ‌సరఫరా చేసేలా కృషి చేయడంతో పాటు, ఇతర ప్రత్యామ్నాయాలు ఏమిటన్నది ఆలోచించండి.  ప్రతి టీచింగ్‌ ఆస్పత్రి వద్ద 10 కెఎల్‌ ‌సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కెఎల్‌ ‌సామర్థ్యంతో ఆక్సీజన్‌ ‌స్టోరేజీ ఉండాలి. వీలైనంత త్వరగా అవి ఏర్పాటు కావాలి. మనకు రోజుకు 500 టన్నుల ఆక్సీజన్‌ ‌కావాలంటే, ఏం చేయాలన్నది ఆలోచించండి. సరఫరా నిల్వ ఎలా అన్నది చూడండని ఆదేశించారు.

Leave a Reply