Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులను కోవిడ్‌ ‌యోధులుగా గుర్తించాలి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రెస్‌కౌన్సిల్‌ ‌సిఫారసు
జర్నలిస్టులను కొవిడ్‌ ‌యోధుల విభాగంలో చేర్చాలని అదేవిధంగా వారికి బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతూ ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా గురువారం కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసింది. ఈ కొరోనా మహమ్మారి పరిస్థితుల్లో ఒడిశా, బిహార్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌రాష్టాల్రు ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వర్కర్స్‌లో జర్నలిస్టులు ఒకరిగా పరిగణించి వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది సెప్టెంబరులో తన తీర్మానాన్ని పునరుద్ఘాటిస్తూ హర్యానా ప్రభుత్వం రూపొందించిన పాలసీ ప్రకారం జర్నలిస్టుల కోసం గ్రూప్‌ ఇన్సూరెన్స్ ‌పథకాన్ని రూపొందించి అమలు చేయాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని పీసీఐ కోరింది. వైద్యుల వలె కొవిడ్‌ ‌వారియర్స్‌గా జర్నలిస్టులను గుర్తించి వారికి అందించే ఆర్థిక ప్రయోజనాలనే కొవిడ్‌-19‌తో మరణించిన జర్నలిస్టులకు తక్షణం అందించాల్సిందిగా సిఫారసు చేసింది. జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా కోరింది. కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఒక్కరోజే 4,12,262 నూతన కరోనా కేసులు నమోదైనట్లు అదేవిధంగా కొవిడ్‌-19‌తో 3,980 మంది మృత్యువాత పడినట్లు సమాచారం.
————

Leave a Reply