Take a fresh look at your lifestyle.

వెలిజర్ల హైస్కూల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

షాద్ నగర్ ప్రజా తంత్ర జనవరి 03: ఫరూఖ్ నగర్ మండలంలోని వెలిజర్ల గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో మహాత్మ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి *పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుఖేందర్ గారు* మాట్లాడుతూ…ఆనాడు ఈ సమాజంలో మహిళలకు చదువుకునే హాక్కేలేదని చెప్పిన పిశ్వబ్రాహ్మణులు చేసిన సందర్భంలో మన సావిత్రిబాయి పూలే ఎన్నో వేదనలు వేహణలను అసమానతలను ఎదుర్కొని  సమాజానికి దీటుగా నిలబడి తాను మహాత్మ జ్యోతిరావు పూలే ద్వారా చదువును అభ్యసించి ఉపాధ్యాయురాలుగా ఎదిగి  సమాజానికి మహిళలకు చదువు కచ్చితంగా అవసరం అని చెప్పి ఎన్నో కష్టాలను ఎదుర్కొని మహారాష్ట్రలో మొట్టమొదటి పాఠశాలను పెట్టి మహిళలకు చదువు నేర్పిస్తూ అలా ఎన్నో పాఠశాలలు నిర్మించి మహిళల కోసం కష్టపడ్డ ఏకైక మొట్టమొదటి భారత దేశపు ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే  అని గుర్తుచేశారు. అదేవిధంగా ఒకవేళ సావిత్రిబాయి పూలే  గనుక లేకపోతే ఈ భారత దేశంలో ఉన్నటువంటి మహిళలకు విద్య అందేది కాదు అని కూడా చెప్పారు.భవిష్యత్తూ తరాలకు విద్య వేత్త గా ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ సావిత్రి పూలే జీవితాలను  స్ఫూర్తిదాయకంగా తీసుకొని భవిష్యత్తులో ఆయా రంగాలలో ఉన్నతంగా రాణించాలని తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఈరోజు ఎన్నో రంగాలలో తమ ప్రతిభ దేశ ఖ్యాతిలో  పాలు పంచుకొనే  దిశగా ఎదిగారంటే దానికి ప్రధాన కారణం ఆనాడు కష్ట కాలంలో విద్యాదానం వల్లే సాధ్యమైందని ఆమె చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు.
ఈ సమావేశంలో పాఠశాల మహిళా ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు *అంబేద్కర్ యూత్ అధ్యక్షులు తుప్పరి జంగయ్య, మరియు వార్డ్ మెంబర్ మర్రి శివకుమార్, గ్రామ నాయకులు అనిమీ గణేష్ గౌడ్, తుప్పరి కుమార్ స్వేరో, ప్రభు మహారాజ్, బైండ్ల మల్లేష్, బైండ్ల నరేష్, కావలి అశోక్, దిర్శనం నరేష్, దొడ్డి చందు మరియు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply