Take a fresh look at your lifestyle.

బడి బుగులు

నాకెందుకో బడి యాదొచ్చి
బుగులైతంది.

ఇన్నొద్దులు
జీవిత అక్షరాలను
విలువల నడతను
సమం, స్వేచ్ఛ, గౌరవాలను
ప్రజాస్వామ్య భావనలను
హక్కును – రాజ్యాంగ బుక్కను
చెప్పేటి సోషల్‌  ‌యాదొచ్చి
బుగులైతందీ.

మన సుట్టున్న ప్రకృతి
మానవుని నడకలోని ప్రవృతి
సమస్త భూగోళం
జీవరాశుల పరిణామాలు
జీవపరిణామాలు
సెప్పేటి సైన్స్ ‌యాదొచ్చి
బుగులైతందీ.

లెక్కలు అంకెల జిమ్మిక్కులు
సిద్ధాంతాలు సూత్రాలు
తలకెక్కని అంకెలు
గుర్తొచ్చి మరీ బుగులతంది

అంగ్లమైతే ఆగమే
అర్థంకాని పదాలు
సదవలేక
ఉచ్చారణకు అసలే రాక
ఇబ్బంది పడ్డ దినాలు
యదొచ్చి బుగులైతంది

హిందీ పాఠాలు
అందలి అక్షరాలు
అంతే చిక్కవు..

కాస్తో కూస్తో
తెలుగు సొబగులు
పసందైన కమనీయమైన
పద్యాలు వాటి అర్థాలు
రాగాలు భలే గుంటై
ఐనా నాకు బుగులైతంది.

టీవీ,సెల్లు,
కనీసం కరెంటు లేని
గుడ్డి జీవితాలు మావి
అందుకే నాకు బుగులైతాంది..

నాగరాజు (మద్దెల), 6301993211
(త్వరలో అశ్రీఱఅవ శ్రీలు టీవీలలో, సెల్‌ ‌లలోపాఠాలు వినాలి అని వచ్చిన వార్తకు స్పందనతో)

Leave a Reply