Take a fresh look at your lifestyle.

ఫిబ్రవరిలో కొరోనా వ్యాక్సిన్‌

  • ఫేజ్‌-1, ‌ఫేజ్‌-2 ‌ప్రయొగాల్లో సమర్థంగా పనిచేసింది
  • ఐసీఎంఆర్‌ ‌శాస్త్రవేత్త రజనీకాంత్‌ ‌వెల్లడి

న్యూఢిల్లీ, నవంబర్‌ 5 : ‌కొరోనా వ్యాక్సిన్‌ ఎప్పు‌డు వొస్తుందనే దానిపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన భారత్‌ ‌బయెటెక్‌ ‌రూపొందిస్తున్న కొరోనా వ్యాక్సిన్‌ ‌కోవాక్సిన్‌ ‌వొచ్చే ఏడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి వొచ్చే అవకాశం ఉందని సీనియర్‌ ‌సైంటిస్టు ఒకరు వెల్లడించారు. ఊహించిన సమయానికంటే ముందే కొరోనా వైరస్‌ ‌వ్యాక్సిన్‌ ‌కోవాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిపారు. కోవాక్సిన్‌ ‌చివరి దశ ట్రయల్స్ ‌దాదాపు 25 వేలమందితో ఈ నెలలో ప్రారంభం కానున్నాయి.

ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీతో కలిసి రూపొందిస్తున్న కోవాక్సిన్‌ను 2021 రెండవ త్రైమాసికంలో విడుదల చేయనుందని ఐసీఎంఆర్‌ ‌రీసర్చ్ ‌మేనేజ్మెంట్‌ ‌హెడ్‌, ‌సీనియర్‌ ‌శాస్త్రవేత్త, కొరోనా వైరస్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ ‌సభ్యుడు రజనీకాంత్‌ ‌తెలిపారు. దీంతో కొరోనా వైరస్‌ ‌నిర్మూలనకు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్‌తో కలిసి భారత్‌ ‌బయోటెక్‌ ‌కంపెనీ రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ ‌టీకా అనుకున్న సమయానికంటే ముందుగానే అందుబాటులోకి వొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వొచ్చే ఏడాది మార్చి తర్వాతే ఈ వ్యాక్సిన్‌ అం‌దుబాటు లోకి వస్తుందని తొలుత ఐసీఎంఆర్‌ అం‌చనా వేసినప్పటికీ అంతకంటే ముందుగా ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్‌ ‌సీనియర్‌ ‌శాస్త్రవేత్త రజనీకాంత్‌ అన్నారు.

Leave a Reply