Take a fresh look at your lifestyle.

తెలంగాణలో జరుగుతున్న పోటీ నమ్మకానికి…అమ్మకానికి మధ్య

కాంగ్రెస్‌ ‌గెలిస్తే ప్రజల పాలన వొస్తది
ఉచిత కరెంటుపై కాంగ్రెస్‌దే పేటేంటు
దొరల గడీలను బద్ధలు కొట్టే సమయం అసన్నమైంది
నేను జైలుకు పోవడానికి ఎర్రబెల్లే కారణం
సర్పంచులు అత్మహత్యలు చేసుకున్నా ఆయన పట్టించుకున్న పాపాన పోలే
దలారులతో ఝాన్సీ పౌరసత్వాన్ని అడ్డుకున్నాడు
పాలకుర్తి జనగర్జన సభలో పీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి

పాలకుర్తి, ప్రజాతంత్ర, నవంబర్‌ 9 : ‌తెలంగాణలో దొరల గడీలను బద్దలు కోట్టే సమయం ఆసన్నమైందని, ప్రస్తుతం జరుగుతున్న పోటీ నమ్మకానికి ప్రతీకయైన కాంగ్రెస్‌కు, అమ్మకానికి ప్రతీకైన భారాసకు మధ్య జరుగుతుందని, నమ్మకంగా పాలించే కాంగ్రెస్‌ ‌కావాలా ..భారాస కావాలా తెలంగాణ ప్రజలు తేల్చుకునే సమయం ఆసన్నమైందని పిసిసి చీఫ•ష్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. పాలకుర్తిలో యశస్వీని రెడ్డి గెలిస్తే ప్రజల పాలన వొస్తుందని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మల్యే కాంగ్రెస్‌ అభ్యర్ధి హనుమాండ్ల యశస్వీనిరెడ్డి నామినేషన్‌ ‌దాఖలు చేసిన సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ ‌శ్రేణులు భారి ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. రాజీవ్‌ ‌చౌరస్తా నుంచి సభ వేదిక వరకు డప్పుచప్పుల్లు, బోనాలు, బత్తుకుమ్మలతో మహిళల కోళాటాలతో  ఘన స్వాగతం పలికి ఘజమాలతో సన్మానించారు. అనంతరం కాంగ్రెస్‌ ఇం‌చార్జీ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అధ్యక్షతన జరిగిన జనగర్జన సభలో రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియమ్మ తెలంగాణ ఇస్తే దోరలు దోచుకుతింటున్నారని విమర్శించారు. గ్రామాలలో వాడకో బెల్టు షాపులు పెట్టి తాగుబోతుల తెలంగాణ చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ‌వొస్తే కరెంటు రాదని ఆయ్యకొడుకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఉచిత కరెంటుపై పేటేంటు కాంగ్రెస్‌కే ఉందన్నారు. అప్పుడు వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉచిత కరెంటు, రైతు రుణమాఫీపైనే మొదటి సంతకం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

పాలకుర్తిలో 24గంటల కరెంటు వొచ్చినట్లు నిరుపిస్తే తాను, యశస్వీని రెడ్డి పోటీలో నుంచి తప్పుకుంటామని సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు. పాలకుర్తికి చరిత్ర ఉంది. ఇక్కడి గాలికి ఫౌరుషం పోరాట పటిమ ఉందన్నారు. కాంగ్రెస్‌ ‌గెలిస్తే ప్రజల పాలన వొస్తుందని, భారాస గెలిస్తే దొరల పాలన వొస్తుందన్నారు. ప్రజలు దొరల వైపు ఉంటారా.. ప్రజలపాలన వైపు ఉంటారా తెల్చుకోవాలన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు నమ్మించి మోసం చేస్తాడన్నారు. తాను జైలుకు పోవడానికి ఎర్రబెల్లే కారణమన్నారు. తెదేపాను దెబ్బతీసిందే ఎర్రబెల్లి అని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు నిధులు రాక సర్పంచులు అత్మహత్యలు చేసుకుంటే ఏ ఓక్కరోజు పంచాయితీ రాజ్‌ ‌మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకరరావు సర్పంచుల సంఘాలను పిలిచి మాట్లాడిన పాపాన పోలేదని విమర్శించారు. ఝాన్సీరెడ్డి పౌరసత్వాన్ని రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు.

అయినా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల వెంటే ఉంటానని తన కోడలును తీసుకవచ్చి పోటీలో నిలిపారన్నారు. ఉన్నత చదువులు చదివి అమెరికాకు పోయి సంపాదించిన దానితో పాలకుర్తి ప్రజలకు విద్యావైద్యం అందించాలని హాస్పిటల్‌ ‌నిర్మించిన ఘనత ఝాన్సిరెడ్డిదన్నారు. ఆమెరికాలో ఎంతో సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికి పాలకుర్తి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆమె పాలకుర్తికి వొచ్చారన్నారు. దయాగుణంతో దానదర్మలు చేస్తున్నారన్నారు. ఈసభకు వచ్చిన ప్రజల ఉత్సహన్ని చూస్తే యశస్వీని రెడ్డి గెలిచినట్లేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు ఇదే ఉత్సాహాన్ని పోలింగ్‌ ‌వరకు తీసుకెల్లి యశస్వీనిరెడ్డిని భారీ మేజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వివిధ గ్రామాలకు చేందిన పలు పార్టీల నుంచి నాయకులు కాంగ్రెస్‌లో చేరగా వారికి రేవంత్‌ ‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.

మీ ఆడబిడ్డగా వొచ్చా… ఆదరించండి : పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్ధి యశస్వీని రెడ్డి
పాలకుర్తి ఆడబిడ్డగా వొచ్చి కాంగ్రెస్‌ అభ్యర్దిగా పోటీలో నిలుస్తున్నానని, ఇక్కడి ప్రజలు ఆదరించి గెలిపించాలని హనుమాండ్ల యశస్వీనిరెడ్డి కోరారు. ఆదరిస్తే అభివృద్ది చేసి చూపిస్తానన్నారు. రాజకీయాల్లో లేకుండానే మాకుటుంబం పాలకుర్తి ప్రజల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నామన్నారు. ఇక రాజకీయాలకు వస్తే ఎంతో అభివృద్ది చేస్తేమో ప్రజలు గుర్తించాలన్నారు. సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకు సేవచేసేందుకు వచ్చామన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా నన్ను గెలిపిస్తే మీవేంటే మీకు తోడునీడగా ఉండి ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మొలుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇం‌చార్జీ హనుమాండ్ల జాన్సీరెడ్డి, ఎర్రబెల్లి సర్ణ, బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అద్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు కుమారస్వామి, కక్కిరాల హరిప్రసాద్‌, ‌నింజన్‌రెడ్డి, వివిద మండల పార్టీల అధ్యక్షులు,రాష్ట్ర,  జిల్లా, గ్రామ స్తాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply