Take a fresh look at your lifestyle.

దశాబ్ది కాలంలో సర్వతోముఖాభివృద్ధిలో నా తెలంగాణ

అది 2009-10వ సంవత్సరం,ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తెలంగాణ ఉద్యమ సమయం.మా జిల్లాలో నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ మాట్లాడిన
‘‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ
అన్నాడు దాశరథి
నాడు లేదులే నాటి సౌభాగ్యం నేడు
అదిగో చూడు
బక్కచిక్కిన పాలమూరు
కరువుకోరాల కభంద హస్తాల్లో హస్తిపంజరమ్మైది నేడు

అదే నేటి నా తెలంగాణ గోడు’’ అంటూ నా ఉపన్యాసాన్ని ప్రారంభించే వాన్ని.సుదీర్ఘ పోరాటమనంతరం  తెలంగాణ సాకారం అయింది.నేడు దశాబ్ది ఉత్సావాలు జరుపుకుంటుంది.ఈ దశాబ్ది కాలంలో నా తెలంగాణ ఎన్నో లక్ష్యాలను సాకారం చేసుకుంది. దాశరథి గారు ఆకాంక్షించిన కోఠి రత్నాల వీణను(కోఠి ఎకరాల పంట పొలాలను)మన ముఖ్యమంత్రి  కే సి ఆర్‌ ‌గారు భగీరథ ప్రయత్నంతో సాకారం చేశారు.
వలసల జిల్లా పాలమూరుకే నేడు ఉత్తరాధి రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నాయి.కరువు కోరాల కబంధ హస్తాలలోని నా పాలమూరు ఎటు చూసిన పచ్చాన్ని పొలాలతో ‘‘భూమికి పచ్చన్ని రంగేసినట్లు’’ అనే పాటను తలపిస్తుంది. తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లు అలుముకుంటాయని, విద్యుత్‌ ‌సంక్షోభం ఏర్పడి రైతులకు,పారిశ్రామిక వేతలకు కరెంటు కష్టాలు ఏర్పడుతాయని అబద్ధపు విష ప్రచారాన్ని పట పంచలు చేస్తూ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తు దేశంలోనే నెంబర్‌ 1 ‌రాష్ట్రంగా నిలిచింది నా తెలంగాణ.పల్లెల్లో, పట్టణాల్లో,పరిశ్రమల్లో నిరంతర విద్యుత్‌ ‌సరఫరాతో పారిశ్రామిక రంగం అభిరుద్ది పథంలో కొత్త పుంతలు తొక్కుతుంది.
తలసరి ఆదాయంలో నా తెలంగాణ దేశ సగటును తలదన్నేలా తలెత్తుకొని నిలబడింది. సినిమాలో నా తెలంగాణభాష రౌడీల భాషగా చేపించే  రోజులు పోయి హీరోల భాషగా మారింది ఈ దశాబ్ది కాలంలోనే. తెలంగాణ తన చరిత్ర,సాంసృతిని పునర్నిర్మాణం చేసుకోవడం ప్రారంభించి ఈ దశాబ్ది కాలంనుంచే.మనకు మాత్రమే ఉన్న ఒక ప్రత్యేక సాంకృతిక పండుగ బతుకమ్మను దేశానికి కాదు కాదు యావత్‌ ‌ప్రపంచానికి తెలియజేస్తూ ఖలీఫా బుర్జు(దుబాయిలోని ప్రపంచంలోనే ఎత్తైన భావనం)పై ప్రదర్శించ గలిగింది నా తెలంగాణ.కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన రాజ్యాంగ శిల్పి అంబేద్కర్‌ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని  దేశంలోనే కాదు ప్రపంచలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్‌ ‌నడిబొడ్డున ఏర్పాటు చేసి రుణం తీర్చుకుంది నా తెలంగాణ.దుర్గం చెరువు తీగల వంతనతో,రింగులు రింగులు తిరిగిన ఫ్లై ఓవర్‌ ‌బీర్జిలాతో, ఆకాశా హర్మాలలాటి అందమైన భవనాలతో,నగరానికి తూర్పు పరమడ,ఉత్తర దక్షిణ మెట్రోరైలతో డల్లాస్‌ ‌ను తలపించేలా అభివృద్ధి చెందింది హైదరాబాద్‌ ఈ ‌దశాబ్ది కాలంలోనే.
కొత్త రాష్ట్రానికి తగట్లు సరికొత్త సెక్రటేరియట్‌ ‌నిర్మించుకొని సమీకృత పాలనకు శ్రీకారం చెట్టింది నా తెలంగాణ.పాలన వికేంద్రీకరణ కోసం పరిపాలన సంస్కరణలు ప్రతిపాదిస్తూ 10 జిల్లాలను 33 జిల్లాలకు పెంచి పాలనను ప్రజల ముందికే తెచ్చారు కేసీఆర్‌ ‌గారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా  రాష్ట్ర వ్యాప్తంగా 299 మాత్రమే ఉన్న గురుకులాలను సుమారు ఒక వెయ్యి  వరకూ  నెలకొల్పి ఆంగ్ల మాధ్యమంలో బొధిస్తూ గురుకుల వ్యవస్థను బలోపెత్తం చేస్తుంది. అందులో సుమారు 4.5 లక్షల వరకు విద్యార్థులు,475 కే జీ బీ వి లలో సుమారు 1.5 లక్షల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.ఆధునాతనమైన వసతులు,ఆధునిక ల్యాబులు,ఆత్యాధునిక కంప్యూటర్‌ ‌సౌకర్యాలు,మంచి గ్రంధాలయం,మంచి ఆట స్థలం,పరిశుభ్రమైన కిచన్‌ ‌షెడ్లు,చక్కటి డైనింగ్‌ ‌హాల్స్ ‌మొదలైన వసతులతో గురుకుల వ్యవస్థ అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పుతూ పరుగులు తీస్తుంది.తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో సంవత్సరానికి ఒక్క విద్యార్తికి సుమారు ఒక లక్ష 20 వేల రూపాయలు  ఖర్చు చేస్తుంది. సుదూర స్వప్నాన్ని కాంక్షించగల మన గౌ’’ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గారు తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా,ఈ పోటీ ప్రపంచంలో అట్టడుగు పేదవారికి కూడా అభిరుద్ది ఫలాలు అందాలంటే ఆంగ్ల విద్యా ఆవశ్యకతను గుర్తించి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడంతోపాటు పాఠశాలల రూపు రేఖలు మార్చుటకు మన ఊరు-మన బడి పథకాన్ని ప్రవేశపెడుతూ 7,289 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.మొదటి విడతలో 9,123 పాఠశాలలకు 3,497 కోట్ల రూపాయలు,రెండవ విడతలో 9,123 పాఠశాలకు,మూడవ విడతలో 7,826 పాఠశాలకు మిగిలిన నిధులు కేటావిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
తెలంగాణ పల్లెల్లో బుక్కెడు మంచినీళ్ల కోసం మహిళలు గంటల తరబడి నిరీక్షేంచేవారు.వారానికి ఒక్కసారి కూడా మంచి నీళ్ళు వచ్చేయి కావు.తెలంగాణ ఉద్యమ కారుడు కేసీఆర్‌ ‌గారి ఆలోచన నుంచి వచ్చిన మిషన్‌ ‌భగీరథ ఈ రోజు పల్లెల్లో,పట్టణాల్లో నిరంతరం సురక్షిత మంచినీటి సరఫరాతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. కాకతీయులా, కుతుబ్‌ ‌షాహిలా,నిజం షాహిలా అభిరుద్ది నమూనాను కొనసాగిస్తూ మిషన్‌ ‌కాకతీయతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా చెరవులు తోలకిసలాడుతున్నాయి.ఉత్తరాన గోదావరి ఉరకలకు కళ్లెం వేస్తున్న కాళేశ్వరం,దక్షిణాన కృష్ణమ్మ పరుగులకు పగ్గలేస్తున్న పాలమూరు ప్రాజెక్టులు నా తెలంగాణను కోఠి ఎకరాల మాఘనిగా మార్చుతున్నాయి.తెలంగాణ పల్లెలు,పట్టణాలు పచ్చదనం పరిశుభ్రతలో పతాక స్థాయిలో నిలుస్తూ అవార్డులు,రివార్డులతో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నాయి.ఐటీ రంగంలో వృద్దిపథంలో ప్రయాణిస్తూ ప్రపంచ స్థాయి అగ్ర సంస్థలకు హైదరాబాద్‌ ‌కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌గా మారింది.‘‘నేను రాను బిడ్డో సర్కారు దావాఖనకు’’ అనే దుస్థితిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు ఆధునిక హంగులను కల్పించి ఆరోగ్య రంగంలో దేశంలోనే అగ్ర భాగాన నిలుస్తుంది నా తెలంగాణ.ఏడు ప్రభుత్వ వైద్య కళశాలల నుంచి నేడు ముప్పయినాలుగు ప్రభుత్వ వైద్య కళశాలలతో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం అయింది.
రైతు సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అని ,రైతు అభిరుద్దే దేశ అభిరుద్దని గుర్తించిన కే సి ఆర్‌ ‌గారు,రైతు బంధు,రైతు భీమా వంటి పథకాలతో రైతు కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నారు.
‘‘గల్లీ చిన్నది గరిబోల్ల కథ పెద్దది’’ అన్న గోరటి వెంకన్న గారి పాటలోని పేదవారి ఇంటి కష్టాలు ఎరగిన కేసీఆర్‌ ‌గారు డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లతో పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నారు.
ఆడపిల్ల పెళ్ళి కష్టాలు తెలిసిన కేసీఆర్‌ ‌గారు కళ్యాణ లక్ష్మి, షాది ముబార్క్ ‌తో ప్రతి ఇంటికి మేనమామ అయ్యారు.
జీవితాంతం కష్టపడినా తనకోసం రూపాయి మిగించుకొనలేని,అవసాన దశలో అష్టకష్టాలు పడుతున్న వృద్దులకు పెద్ద కొడుకుగా మారి ఆసరా పెన్షన్‌ ‌తో ఆదుకుంటున్నారు. దివ్యాంగులకు,ఒంటరి మహిళకు,వృత్తి కళాకారులకు పెన్షన్‌ ‌మంజూరు చేస్తూ సంక్షేమంలో ప్రపంచానికే పాఠాలు నేర్పుతుంది నా తెలంగాణ.
గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ,మత్స్యకారులకు చేపల పంపిణీ,గౌడ కులస్తులకు కళ్ళుగీత పెన్షన్‌,‌దళితులకు దళిత బందు,బీ సి కుల వృత్తులకు  లక్ష్య రూపాయల చేయూత ఇలా సభండ వర్గాలకు చేయూతనిస్తుంది నా తెలంగాణ.
ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందో ఈ దశాబ్ది కాలంలో ఆ లక్ష్యాలను సాధించి సర్వతోమూఖాభి వృద్ధితో ముందుకు సాగుతుంది నా తెలంగాణ.
image.png
జుర్రు నారాయణ యాదవ్‌
‌తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌
‌జిల్లా అధ్యక్షులు, మహబూబ్‌ ‌నగర్‌, 9494019270.

Leave a Reply