Take a fresh look at your lifestyle.

హైకోర్టును కూడా ధిక్కరిస్తున్నారు

ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు
కొరోనాపై కాకి లెక్కలతో మభ్య పెడుతున్నారు
రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శ

సీఎం కేసీఆర్‌ ‌హైకోర్టును ధిక్కరించే పరిస్థితి రావటం దారుణమని బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ప్రజల ప్రాణాలపై హైకోర్టు ప్రశ్నించినా ముఖ్యమంత్రి స్పందించకపోవటం అన్యాయమని బండి సంజయ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేట్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించలేక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సమస్య చిన్నదిగా చూపించి సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్‌ ‌విమర్శించారు. ఆరోగ్యశాఖ తప్పుడు హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేస్తోందని మండిపడ్డారు. జిల్లాల్లో కొరోనా కేసుల పూర్తి వివరాలు చెప్పకపోవడంతో వైరస్‌ ‌వ్యాప్తి ఎక్కువ అవుతోందని, ఘోరమైన పరిస్థితిలో రాష్ట్రముంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రజల బాగోగులు చూడటానికే ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన విషయాన్ని కేసీఆర్‌ ‌గుర్తుంచుకోవాలని ఎంపీ సూచించారు. ఫాంహౌస్‌, ‌ప్రగతి భవన్‌ ‌నుంచి ముఖ్యమంత్రి బయటకు రావాలని, కొరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో వైద్య సిబ్బందిని నియమించాలని, శ్మశానవాటికలో సీసీ కెమెరాలు పెడితే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి మాటలు విని ప్రజలు బయటకొస్తే  ప్రాణాలు పోతాయని సంజయ్‌ అన్నారు. ప్రజలు ప్రాణాలపై హైకోర్టు ప్రశ్నించినా ముఖ్యమంత్రి స్పందించకపోవటం అన్యాయమన్నారు. సీఎం కేసీఆర్‌ ‌హైకోర్టును ధిక్కరించే పరిస్థితి రావటం దారుణమని వ్యాఖ్యానించారు. ఘోరమైన పరిస్థితిలో రాష్ట్రముంటే ముఖ్యమంత్రి మాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్‌ ‌మానవత్వం లేని మానవ మృగమని అన్నారు. కొరోనాపై సక్ష నిర్వహించిన ఆయన పలు అంశాలపై ప్రస్తావించారు. కేంద్ర •ంశాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి కరోనా వచ్చిందంటూ ప్రచారం జరుగుతుందని, అందులో వాస్తవం లేదని అన్నారు.కేసీఆర్‌ అసమర్థత పై రాయండి మానవత్వం లేని మానవ మృగంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్లో 100 బెడ్స్ ‌కి మాత్రమే ఆక్సిజన్‌ ఇచ్చే వసతి ఉందని.. అలాంటిది 250 బెడ్స్ ‌కి ఆక్సిజన్‌ ఎలా ఇస్తారని బండి సంజయ్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.సెంట్రలైజ్డ్ ఆక్సిజన్‌ ‌సరఫరా వ్యవస్థ కూడా దెబ్బతిందన్న ఆయన .. ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేసే ఉద్యోగులు సైతం కార్పోరేట్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అవుతున్నారని చెప్పారు. వాళ్ళకి భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, వాళ్ల జీతాలు ఎందుకు పెంచడం లేదని అడిగారు.కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని జేబులో వేసుకున్న కేసీఆర్‌ ..‌డబ్బుల కక్కుర్తితో డాక్టర్లకు నాసిరకం పీపీఈ కిట్స్, ఎన్‌ 95 ‌మాస్క్‌లు ఇచ్చారని మండిపడ్డారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం సీఎం కేసీఆరేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌ఫాం హౌస్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారన్న బండిసంజయ్‌ ..‌గవర్నర్‌ ‌మాటలకు సీఎం గౌరవం ఇవ్వరు..దొంగ లెక్కలను గుర్తించి హైకోర్టు సీరియస్‌ అయింది.. హెల్త్ ‌బులెటిన్‌ ‌సమగ్రంగా ఉండడం లేదు. మరణాల సంఖ్య, పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య చెప్పడం లేదని అసహనం వ్యక్తం చేశారు.కేసీఆర్‌, ఈటెల మధ్య ఉన్న విభేదాలు ఈ పరిస్థితికి కారణమన్నారు.

Leave a Reply