Take a fresh look at your lifestyle.

రైతుల పక్షాన టిఆర్‌ఎస్‌ ‌పోరాటం

  • మహాధర్నా ద్వారా కేంద్రం తీరును నిలదీస్తాం
  • ప్రజలకు బిజెపి వ్యవహారం తెలియాల్సి ఉంది
  • నేటి ధర్నాతో ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి
  • ఇందిరాపార్క్ ‌వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు

రాష్ట్ర రైతుల పక్షాన నిలబడేందుకు టీఆర్‌ఎస్‌ ‌పార్టీ మహాధర్నాను తలపెట్టిందని ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. మహాధర్నా ద్వారా తమ డిమాండ్‌ను కేంద్రానికి తెలియచేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. అలాగే కేంద్రం తీరును కూడా రైతులకు తెలియజేయాలన్నది కూడా తమ లక్ష్యమన్నారు. నేటి ఇందిరా పార్కు వద్ద టీఆర్‌ఎస్‌ ‌మహాధర్నా ఏర్పాట్లను బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌తో కలిసి హరీష్‌ ‌రావు పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు వి•డియాతో మాట్లాడుతూ..రాష్ట్ర రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా తాము ప్రజల పక్షాన ఉంటామన్నారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను, లోయర్‌ ‌సీలేరు పవర్‌ ‌ప్లాంట్‌ను అన్యాయంగా ఆంధ్రాలో కలిపారని, దీని వల్ల సంవత్సరానికి రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు.

ఏడు మండలాలను, లోయర్‌ ‌సీలేరును ఆంధ్రాలో కలిపిన నాడే కేసీఆర్‌ ‌తీవ్ర నిరసన వ్యక్తం చేశారని, ఇవాళ కూడా లక్షలాది మంది రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ మహాధర్నా చేపట్టబోతున్నామని హరీష్‌ ‌రావు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని, పంజాబ్‌లో పండించే ప్రతి గింజను కొంటున్నారు కానీ తెలంగాణలో పండించిన ధాన్యాన్ని మాత్రం కొనడం లేదని, ఈ పద్ధతి సరికాదని అన్నారు. వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, రాష్ట్ర రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచాలని తాము నిర్ణయించుకున్నామని, రాష్ట్ర ప్రజలు, రైతుల కోసమే ఈ ధర్నా అని తేల్చిచెప్పారు. మహాధర్నా శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా చేయబోతున్నామని, ఈ ధర్నాలో టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొంటారని హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు.

Leave a Reply