Take a fresh look at your lifestyle.

ముత్తిరెడ్డి ది పెద్ద మనసు..!

 

తెలంగాణ ఉద్యమానికి పోరు గడ్డ జనగామ ప్రాంతం. 

పెద్ద మనసుతో పల్ల రాజేశ్వర్ రెడ్డిని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వదించడమే కాకుండా భవిష్యత్తులో చేయాల్సిన పనుల బాధ్యతను అప్పగించారనీ తెలుపుతూ జనగాంలో ఎంట్రీతోనే అద్భుతమైన విజయం సాధించే దిశగా సాగుతున్న రెడ్డి కి మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. 16వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ నేపధ్యంలో జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశానికి ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించారన్నారు. యాదన్న లాగా జనగామని కంటికి రెప్పలా కాపాడుకునే మరో నాయకుడు దొరికాడు అని పరిచయం చేస్తూ  సూర్యాపేట జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి అనే విద్యార్థి 2010 లో ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్, బిజెపి ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చేసుకొని అమరుడయ్యాడు..విద్యార్థి మృతదేహాన్ని తరలించే క్రమంలో పోలీస్ లాఠీచార్జిల మధ్యలో తొలిసారి పరిచయమైన వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి అని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎమ్మెల్సీగా, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా అనేక బాధ్యతలతో ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ బాధ్యతలు చేపట్టడం సంతోషకరమైన విషయమన్నారు.జనగామలో గెలుపు విషయంలో అనుమానం లేదు మెజార్టీ ఎంత అనేది ముఖ్యం.. సిద్దిపేటలో నాతో, పక్కన దయాకర్ రావుతో పోటీ పడాల్సిందే అన్నారు.అన్ని వర్గాలను కలుపుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభ ను లక్ష మందితో విజయవంతం చేసుకుందామని పిలుపునిచ్చారు. నాయకులు ఇద్దరు కలిసి పోయారు కాబట్టి కార్యకర్తలు కూడా మనస్పర్ధలు లేకుండా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా అన్నారు.పల్లా రాజేశ్వర్ రెడ్డిని లక్ష వోట్ల మెజార్టీతో గెలిపించాలని మంచి మనసుతో ముత్తిరెడ్డి యాదగిరి దీవించారన్నారు. .ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, స్థానిక ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రైతు సమన్వయ సమితి చైర్మన్ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

 

 

 

 

Leave a Reply