Take a fresh look at your lifestyle.

‌ప్రశ్నోత్తరాలు ఉండవు ..!

  • పార్లమెంట్‌ ‌సమావేశాలపై కోవిడ్‌-19 ఆం‌క్షలు
  • సెప్టెంబర్‌ 14‌న ప్రారంభం

దేశ అత్యున్నత చట్ట సభ, పార్లమెంటు సమావేశాలు మరో వారంలో మొదలవబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ – 19 ‌మహమ్మారి సృష్టించిన భయంకర వాతావరణం నేపథ్యంలో సెప్టెంబర్‌ 14-అక్టోబర్‌ 1 ‌వరకు పార్లమెంటు వానాకాలం సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశాలలో ప్రశ్నోత్తరాలు ఉండవని లోక్‌ ‌సభ, రాజ్యసభ కార్యదర్శులు ఇప్పటికే నోటిఫికేషన్‌ ‌విడుదల చేసారు. ప్రజాస్వామ్యానికి పునాదులైన పార్లమెంటు ఉభయ సభలలో అసలు నిర్వర్తించవలసిన విధి విధానాలను ఒకసారి పరిశీలిద్దాం.

ప్రశ్నోత్తర సమయం ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి?
ప్రశ్నోత్తర సమయం పార్లమెంటులో ఓ గంటపాటు నడుస్తుంది. సభా కార్యక్రమం ప్రతిరోజూ ప్రశ్నోత్తరాలతో మొదలై సాధారణంగా గంటసేపు సాగుతుంది. పార్లమెంటు సభ్యులు మంత్రుల ద్వారా ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మంత్రులు తమ తమ శాఖల పనితీరుకు జవాబుదారీగా వుంటూ సభ్యుల ప్రశ్నలకు తమ మంత్రాలయం నుంచి సమాచారం తెప్పించుకుని సమాధానం ఇస్తారు. ప్రశ్నోత్తరాల ద్వార ప్రభుత్వ పనితీరు ప్రజలకు తెలియజేసేందుకు పార్లమెంట్‌ ‌సభ్యులు గత 70 ఏళ్లుగా ఈ సమయాన్ని వినియోగించు కుంటున్నారు. ఎంపీల ప్రశ్నలు ప్రభుత్వ శాఖలలో అవకతవకలను బహిర్గతం చేయటంతో పాటుగా ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఉపయోగ పదే ప్రక్రియ. పార్లమెంటు కార్యకలాపాలు దూరదర్శన్‌లో 1991 నుండి ప్రసారం కావడం మొదలవ్వడంతో ప్రశ్నోత్తర సమయం కీలకమై ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రశ్నోత్తర సమయం ఎప్పుడు పుట్టింది..?
లోక్‌ ‌సభ నియమాలలో ప్రతిరోజూ ఒక గంటసేపు ప్రశ్నోత్తర సమయం నిర్వహించడానికి 1952 పార్లమెంట్‌ ‌ప్రారంభంలో నిర్ణయించారు. అదే విధంగా రాజ్యసభలో వారానికి రెండు రోజులు ప్రతి రోజూ గంటపాటు ప్రశ్నోత్తర సమయంగా నిర్ణయించారు. అయితే  కొన్ని నెలలలోనే రాజ్యసభలో వారానికి నాలుగు రోజులు ప్రశ్నోత్తర సమయం జరగేలా కార్యక్రమం మార్పుజేసారు. అయితే ఆ విధానం వలన సంతృప్తి చెందక  ప్రతి రోజు కూడా రాజ్యసభలో ప్రశ్నోత్తర సమయం గంట పాటు ఉండాలని 1964లో నిర్ణయం జరిగింది. అప్పటినుంచీ పార్లమెంట్‌ ‌సమావేశాలు జరిగిన అన్నిరోజులూ ఉభయ సభలూ ప్రశ్నోత్తరాల గంటతో కార్యక్రమాలు  మొదలవ్వడం  రివాజయింది. అయితే ప్రశ్నోత్తర సమయానికి రెండు రోజుల మినహాయింపు ఉంది. ఎన్నికలు జరిగిన అంతరం ఏర్పాటు అయిన కొత్త లోక్‌ ‌సభ ప్రారంభం రోజున రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి రాష్ట్రపతి సెంట్రల్‌ ‌హాలులో ప్రసంగించేటప్పుడు ఈ ప్రశ్నోత్తర సమయం ఉండదు. ఆ విధంగానే కేంద్ర ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టే రోజు కూడా  ప్రశ్నోత్తర సమయం షెడ్యూల్‌ ‌చేయరు.

ప్రశ్నోత్తర సమయం తర్వాత – జీరో అవర్‌ ఏమిటి?
ప్రశ్నోత్తర సమయం ఖచ్చితంగా గంటకి నియంత్రించిన నేపథ్యంలో, జీరో అవర్‌ అనే కార్యక్రమాన్ని పార్లమెంట్‌ ‌కనుగొన్నది. అయితే ఈ జీరో అవర్‌ ‌నియమాలను ఇతమిత్థంగా  ప్రస్తావించలేదు. తమ నియోజకవర్గం లేదా అతి ముఖ్యమైన జాతీయ సమస్యలను లేవనెత్తవలసిన అవసరం ఉందని ఎంపీలు భావించినప్పుడు ఈ జీరో అవర్‌ ‌వాడుకుంటారు. మన దేశంలో పార్లమెంట్‌ ‌మొదలైన మొదటి దశాబ్దంలో జీరో అవర్‌ ‌ప్రారంభమైంది. ప్రారంభ రోజుల్లో, పార్లమెంటు మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనానికి విరామం తీసుకునేది. 11 నుంచి 12 వరకు ప్రశ్నోత్తరాల సమయం అటుపై ముందస్తు నోటీసు లేకుండా ఎంపీలు జాతీయ సమస్యలను లేవనెత్తే అవకాశం మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. సభ భోజనానికి వాయిదా పడే వరకు గంటసేపు జీరో అవర్‌ ఉం‌టుంది. జీరో అవర్‌ ‌రూల్స్ ‌బుక్‌లో భాగం కాకపోయినప్పటికీ పౌరులు, మీడియా, ఎంపిలు ప్రిసైడింగ్‌ అధికారుల నుండి అందుతున్న మద్దతు దీనికి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జీరో అవర్‌ ‌ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు.

ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎలా నియంత్రిస్తారు?
ప్రశ్నోత్తరాల సమయం గంటలో ప్రతి ముఖ్యాంశం ప్రస్తావించడానికి పార్లమెంట్‌ ‌రూల్‌ ‌బుక్‌లో సమగ్ర నియమాలు ఉన్నాయి. ప్రశ్నోత్తరాల సమయం, ప్రవర్తన నియమావళి అమలు సంబంధించిన తుది అధికారం ఉభయ సభల ప్రిసైడింగ్‌ అధికారులు కలిగి ఉంటారు.

పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి మార్గ దర్శకాలు?
ఎంపీలు అడిగే ప్రశ్నలకి సంబంధించిన మార్గదర్శకాలను పార్లమెంటరీ నియమావళిలో స్పష్తం చేసారు. ప్రశ్నలను 150 పదాలకు పరిమితం చేయాలి. ప్రశ్న చిన్నదిగా ఉండాలి. అతి సామాన్యమైన అంశాలకి పరిమితమై ఉండకూడదు. ప్రశ్న భారత ప్రభుత్వ బాధ్యత పరిధిలోనికి వచ్చే ప్రాంతానికి సంబంధించి అయి ఉండాలి. రహస్య అంసాలు, న్యాయస్థానాలలో ఉన్న విషయాల గురించిన సమాచారాన్ని ప్రశ్నించకూదదు. పార్లమెంట్‌ ‌సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలా వద్దా అనేది ఉభయ సభల ప్రిసైడింగ్‌ అధికారులు నిర్ణయిస్తారు. ప్రస్తుత లోక్‌సభ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు లోక సభలో సుమారు 15 వేల ప్రశ్నలు ఎంపీలు అడిగారు. ఇక పార్లమెంటు ఈ వానకాల సమావేశాల్లో, ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న ఎంపీలు ప్రశ్నోత్తర సమయం వాడుకునే అవకాశం లేకుండా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply