Take a fresh look at your lifestyle.

మరింత పక్కాగా ఇంటర్‌నెట్‌ ‌సేవలు

ముంబై,డిసెంబర్‌1 : ‌కస్టమర్లకు ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌సేవలు మరింత సురక్షితంగా అందించేందుకు ఎస్బీఐ చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్‌ ‌లావాదేవీలు చేయాలంటే ఇకపై రిజిస్టర్డ్ ఈ ‌మెయిల్‌ అ‌డ్రస్‌ ‌కు వచ్చిన ఓటీపీని వాడాల్సి ఉంటుంది. సైబర్‌ ‌నేరాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ‌లో పోస్ట్ ‌చేసింది. ఇప్పటి వరకు బ్యాంక్‌ ‌ఖాతాకు లింక్‌ ‌చేసిన ఫోన్‌ ‌నెంబర్‌ ‌కు ఓటీపీ వచ్చేది. దాన్ని ఉపయోగించి ఆన్‌ ‌లైన్‌ ‌బ్యాంకింగ్‌ ‌చేసేవాళ్లు. దీనివల్ల హ్యాకర్లు ఓటీపీని దొంగలించి బ్యాంక్‌ ‌ఖాతాని ఖాళీ చేసే అవకాశం ఉంది.

ఈ – మెయిల్‌ ఓటీపీ వెరిఫికేషన్‌ ‌ద్వారా సెక్యూరిటీ పెరుగుతుంది. ఈ సేవలు పొందాలంటే ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌లో ప్గ్రొల్‌ ఓపెన్‌ ‌చేయాలి. అందులో ఉన్న హై సెక్యూరిటీ ఆప్షన్‌ ‌క్లిక్‌ ‌చేసి, ఈ -మెయిల్‌ ఆప్షన్‌ ‌పై సెలక్ట్ ‌చేసుకోవాలి. దీంతో ఈ మెయిల్‌ ఓటీపీ వెరిఫికేషన్‌ ఎనేబుల్‌ అవుతుంది. అంతేకాకుండా బ్యాంక్‌ ‌నుంచి అకౌంట్‌ ‌వివరాలు, ఓటీపీ, ఏటీఎం పిన్‌ ‌నెంబర్లు చెప్పమని బ్యాంకుల నుంచి నుంచి ఎలాంటి ఫోన్‌ ‌కాల్స్ ‌రావు. ఏ వినియోగదారుడు వాటికి రెస్పాండ్‌ అవ్వాల్సిన పనిలేదు. కాకపోతే ఆన్‌ ‌లైన్‌ ‌బ్యాంకింగ్‌ ‌చేసేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని మాత్రం ఎస్బీఐ సూచించింది.

Leave a Reply