Take a fresh look at your lifestyle.

దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర అమోఘం

“1909‌లో హైదరాబాద్‌ ‌వరద ప్రమాదాన్ని ఎదుర్కొన్న దశలో ప్రత్యేక కన్సల్టెంట్‌ ఇం‌జనీరుగా నేటి మహానగరానికి మూసీనది వరద నియంత్రణ వ్యవస్థలో భాగంగా హుసేన్‌సాగర్‌ ‌డ్యామ్‌తో పాటు అనేక సివిల్‌ ‌నిర్మాణాలకు ఆద్యుడైనారు. విశాఖపట్టణం సముద్ర కోతకు గురికాకుండా ఇంజనీరింగ్‌ ‌ప్రతిభ ప్రదర్శించి అడ్డుకోవడమే కాకుండా తిరుపతి తిరుమల రోడ్డు నిర్మాణానికి అమూల్య ఇంజనీరింగ్‌ ‌సూచనలు చేశారు. నీటిపారుదలలో సరికొత్త ‘బ్లాక్‌ ‌సిస్టమ్‌’ ‌ప్రవేశపెట్టారు. 1903లో పుణె వద్ద కడక్‌వాస్లా డ్యామ్‌కు మ్నెదటిసారి ఆటోమాటిక్‌ ‌గేట్లు, ఫ్లడ్‌ ‌గేట్లు అమర్చిన ఘనత వారిది. 1955లో భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ పొందిన (జవహర్‌లాల్‌ ‌నెహ్రూతో పాటు) విశ్వేశ్వరయ్య కింగ్‌ ‌జార్జి-• చేత ‘నైట్‌ ‌వుడ్‌’ ‌స్వీకరించి ‘సర్‌’ ‌గౌరవ బిరుదు అందుకున్నారు.”

నేడు ‘జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా..

దేశ సమగ్రాభివృద్ధిలో ఇంజనీర్లు ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారని, శాస్త్రసాంకేతిక నైపుణ్యాలను మానవాళి ఆర్థిక సామాజిక సంక్షేమానికి వినియోస్తారని మనకు తెలుసు. దేశానికే గర్వకారణమైన ఆదర్శ ఇంజనీర్‌ ‌మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా ప్రతియేటా 15 సెప్టెంబర్‌, ‘‌జాతీయ ఇంజనీర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అత్యంత ప్రతిభ కనబర్చిన ఇంజనీర్లను సన్మానించి గౌరసిస్తున్నాం., దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రను అవగాహన చేసుకుని, జాతీయాభివృద్ధిలో చేపట్టవలసిన ఇంజనీరింగ్‌ ‌నిర్మాణాల గురించి చర్చలు చేపడతారు. 1861 సెప్టెంబరు 15న కర్ణాటక, మద్దెనహల్లి లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించారు. చదువుల్లో రాణిస్తూ మద్రాస్‌ ‌విశ్వవిద్యాలయం నుండి సివిల్‌ ఇం‌జనీరింగ్‌లో బిఏ డిగ్రీ పూర్తిచేసి, 1885లో బొంబాయ్‌ ‌ప్రభుత్వ పబ్లిక్‌ ‌వర్కస్ ‌విభాగంలో సివిల్‌ అసిస్టెంట్‌ ఇం‌జనీర్‌ ‌గా నాసిక్‌, ‌ధూలే పుణే లో ఉద్యోగం చేరారు. 1896లో పదోన్నతితో ఈఈగా సూరత్‌ ‌నీటిపారుదల, సానిటరీ ఇంజనీరుగా బొంబాయిలో సేవలందించారు. 1898 లో చైనా, జపాన్‌ ‌సందర్శించి అనేక సాంకేతిక అనుభవాలు గడించారు. 1909లో బ్రిటీష్‌ ‌ప్రభుత్వ సర్వీసు నుండి పదవీవిరమణ పొంది, మైసూర్‌ ‌ప్రభుత్వ సెక్రెటరీగా, దీవాన్‌ ఆఫ్‌ ‌మైసూర్‌గా, టాటా స్టీల్‌ ‌బోర్డులో డైరెక్టర్‌గా 1955 వరకు సేవలు అందించారు.

సివిల్‌ ఇం‌జనీరుగా, ఆర్థిక వేత్తగా, నీటి యాజమాన్య నిపుణుడిగా, డ్యాముల నిర్మాతగా, స్టేట్స్ ‌మెన్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి విశ్వేశరయ్య దేశాభివృద్ధికి బీజాలు వేశారు. 1912 నుండి 1918 వరకు 19వ ‘మైసూర్‌ ‌దివాన్‌’‌గా విధులు నిర్వహించి మైసూర్‌ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది ‘ఫాదర్‌ ఆఫ్‌ ‌మాడ్రన్‌ ‌మైసూర్‌’‌గా పేరొందారు. ఆసియాలోని అతి పెద్ద కృష్ణ రాజ సాగర్‌ ‌డ్యామ్‌ను మైసూర్‌లో నిర్మించారు. 1909లో హైదరాబాద్‌? ‌వరద ప్రమాదాన్ని ఎదుర్కొన్న దశలో ప్రత్యేక కన్సల్టెంట్‌ ఇం‌జనీరుగా నేటి మహానగరానికి మూసీనది వరద నియంత్రణ వ్యవస్థలో భాగంగా హుసేన్‌సాగర్‌ ‌డ్యామ్‌తో పాటు అనేక సివిల్‌ ‌నిర్మాణాలకు ఆద్యుడైనారు. విశాఖపట్టణం సముద్ర కోతకు గురికాకుండా ఇంజనీరింగ్‌ ‌ప్రతిభ ప్రదర్శించి అడ్డుకోవడమే కాకుండా తిరుపతి తిరుమల రోడ్డు నిర్మాణానికి అమూల్య ఇంజనీరింగ్‌ ‌సూచనలు చేశారు. నీటిపారుదలలో సరికొత్త ‘బ్లాక్‌ ‌సిస్టమ్‌’ ‌ప్రవేశపెట్టారు. 1903లో పుణె వద్ద కడక్‌వాస్లా డ్యామ్‌కు మ్నెదటిసారి ఆటోమాటిక్‌ ‌గేట్లు, ఫ్లడ్‌ ‌గేట్లు అమర్చిన ఘనత వారిది. 1955లో భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ పొందిన (జవహర్‌లాల్‌ ‌నెహ్రూతో పాటు) విశ్వేశ్వరయ్య కింగ్‌ ‌జార్జి-• చేత ‘నైట్‌ ‌వుడ్‌’ ‌స్వీకరించి ‘సర్‌’ ‌గౌరవ బిరుదు అందుకున్నారు. గ్వాలియర్‌లో టైగ్రా డ్యామ్‌, ‌బీహార్‌లో మోకమ వారధి, మైసూర్‌ ‌సోప్‌ ‌ఫాక్టరీ, మైసూర్‌ ఐరన్‌ అం‌డ్‌ ‌స్టీల్‌ ‌వర్కస్, ‌స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌మైసూర్‌, ‌బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, బెంగుళూరు పాలిటెక్నిక్‌, ‌మైసూర్‌ ‌చాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్, ‌విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇం‌జనీరింగ్‌, ‌బెంగుళూరు ప్రెస్‌, ‌కన్నడ పరిషత్‌ ‌లాంటి అనేక సంస్థలను ప్రారంభించటంలో భాగస్వాము లైనారు. ఎనిమిది విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు, లండన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సివిల్‌ ఇం‌జనీర్స్ ‌సభ్యత్వం, బెంగుళూరు ఐఐయస్సీ ఫెల్లోషిప్‌, ‌గూగుల్‌ ‌డూడుల్‌ ‌గౌరవాలను స్వంతం చేసుకున్నారు. విశ్వేశ్వరయ్య ప్రతిభను గుర్తించి అనేక ఇంజనీరింగ్‌ ‌కళాశాలలు, రెండు మెట్రో స్టేషన్లకు పేరు పెట్టి ఆ స్పూర్తిని పొందుతున్నారు. అపార ప్రతిభను స్వంతం చేసుకున్న సర్‌ ‌మోక్షగుండం విశ్వేశ్వరయ్య 14 ఏప్రిల్‌ 1962‌లో కన్ను మూశారు.

ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ ప్రయోజక సాగునీటి ప్రాజెక్టుగా కాళేశ్వరరావు ప్రాజెక్టుకు పేరుపెట్టారు. తెలంగాణలో 45 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరందించగల ప్రాజెక్టును గోదావరి నదిపై రూ. 80,000 కోట్లతో ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 3 బ్యారేజీలు, 20 లిఫ్టులు, 19 రిజర్వాయర్లు, 19 పంపు హౌజులతో 145 టియంసీల నీటిని 40 మెగావాట్ల సామర్థ్యంగల 43 యంత్రాలు నీటిని ఎత్తి పోస్తూ 203 కిమీ టనల్స్ ‌ద్వారా 1,531 కిమీ దూరం కాలువల ద్వారా నీటిని సరఫరా చేయడం ఒక ఇంజనీరింగ్‌ అద్భుతంగా పేరొందింది. అతి పెద్ద అండర్‌‌గ్రౌండ్‌ ‌పంపుహౌజ్‌తో 330 మీటర్ల ఎత్తుకు నీటిని పంపుచేసే 139 మెగావాట్ల సామర్థ్యంగల ఐదు బాహుబలి పంపులతో రోజుకు 2 టియంసీల నీటిని ఎత్తి పోసే ఇంజనీరింగ్‌ ‌మన ముందు నిలిచింది. పలువురు జాతీయ అంతర్జాతీయప్రతిభావంతులైన ఇంజనీర్ల అవిరళ కృషితో అనేక జీవనాధార ప్రాజెక్టులు మానవాళి సంక్షేమానికి నిరంతరం శ్రమ చేస్తున్నారు. ఇలాంటి ఇంజనీర్లకు మార్గదర్శిగా నిలిచిన విశ్వేశ్వరయ్య భారతీయులందరికీ మార్గదర్శి పూజ్యనీయుడు.

dr burra madhusudhan reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply