Take a fresh look at your lifestyle.

ఉపపోరు భేరి మోగింది !

ఉప ఎన్నికల భేరి మోగింది
ప్రచార ధ్వారం తెరుచుకొంది
ఇంకేం
కొత్తనాటకాలు రక్తికడతాయి
మిధ్యా పథకాలు ప్రభవిస్తాయి
అలవికాని హామీలు వర్శిస్తాయి
వోటు బ్యాంకు లెక్క తూగుతాయి
కుల సమీకరణలు కుదురుతాయి
జిత్తుల పొత్తులు హత్తుకుంటాయి

ఊరూరా…వాడ వాడలా…
పార్టీ జెండాలు రెపరెపలాటలు
పాదయాత్రలు, వాహన ర్యాలీలు
సభలు సమావేశాలు సమ్మేళనాలు
నినాదాలు, జేజేలు ప్రచార హోరులు

గడప గడపలో…
పచ్చనోట్లు విచ్చుకుంటాయి
మద్యం నదులు ఉప్పొంగుతాయి
విందు,వినోదాలు కనువిందుజేస్తాయి
సంబురాలు అంబరాన్ని అంటుతాయి

వోటరు మిత్రమా !
బహురూపునేతల నమ్మితే
నగుబాటు తప్పదు సుమా !
అందుకే ఇకనైనా..
అమాయకత్వం త్యజించి
ఆలోచనల పదును పెంచు

అలసత్వం బహిష్కరించి
నవ చైతన్యాన్ని స్వాగతించు

ప్రలోభాలను తృణీకరించి
ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించు

అవకాశవాదుల పక్కనెట్టి
సచ్చీలనేతలకు పట్టంగట్టు
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టు

(వోటరుకు మేలుకొలుపుగా….)
-కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply