- రెండుకోట్ల మందికి పంపిణీ
- సచివాలయంలో కేక్ కట్ చేసి అభినందించిన సిఎస్
రాష్ట్రంలో రెండు కోట్ల మందికి కోవిడ్ వాక్సినేషన్ పూర్తయ్యింది. ఈ సందర్బంగా తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేక్ కట్ చేసి గత కొన్ని నెలలుగా వాక్సినేషన్ పక్రియలో పాల్గొన్న వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని సీఎస్ అభినందించారు.
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. వ్యాక్సినేషన్ పక్రియలో తెలంగాణ దేశంలో ముందు వరుసలో ఉంది. ప్రత్యేక కేంద్రాల ద్వారానే కాకుండా, మొబైల్ సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్ పక్రియను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీంతో బుధవారం నాటికి రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఓఎస్డీ గంగాధర్, వైద్య శాఖ సంచాలకులు జి. శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.