Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ..

  • రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం
  • మెట్రో రైల్‌ ‌విస్తరణ ..హకీ•ంపేట, మామునూర్‌ ‌విమానాశ్రాయల పునరుద్ధరణ కు ఆమోదం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై 31: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ  43,373   ఉద్యోగులకు  శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది.  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన సోమవారం  మంత్రివర్గ మండలి సమావేశం  జరిగింది.  ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశమై చర్చించింది. మంత్రి మండలి సమావేశ నిర్ణయాలను మంత్రి కేటీఆర్‌ ‌మీడియా కు వివరించారు.  త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.హైదరాబాద్‌ ‌మెట్రో నగరం నలుదిశలా విస్తరించేలా ప్రణాళికల రూపకల్పనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ ‌లో హకింపేట రెండవ విమానాశ్రయంగా ,వరంగల్‌ ‌మామునూర్‌ ‌విమానాశ్రయ నిర్మాణానికి మంత్రి మండలి నిర్ణయించింది.అనాధ పిల్లల సంరక్షణ కోసం మహిళా ,శిశు సంక్షేమ మంత్రి కి బాధ్యతలు అప్పగించింది.

వరద నష్టంపై చర్చించిన మంత్రి మండలి
తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ ‌తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాలు లో తిరిగి తీర్మానం చేసి ..రెండోసారి తీర్మానం చేసి  గవర్నర్‌ ‌పంపుతామని ..ఆమోదించక తప్పదు..అని కేటీఆర్‌ అన్నారు. గవర్నర్‌ ‌కోటాలో ఎమ్మెల్సీలు గా ఎస్టీల నుంచి కుర్రా సత్యనారాయణ, దాసోజు  శ్రావణ్‌ ‌ల ను  గవర్నర్‌ ‌కు ప్రతిపాదిస్తూ క్యాబినెట్‌ ‌తీర్మానం..చేసింది. వరంగల్‌ ‌పట్టణంలో మామ్‌ ‌నూర్‌   ఎయిర్‌ ‌పోర్టు కు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ కు పంపాలని కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ ‌కు మరో ఎయిర్‌ ‌పోర్టు అవసరం ఉందనీ..హాకింపేట ఎయిర్పోర్ట్ ‌ను గోవా తరహాలో పౌర విమానయాన సేవలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరతూ క్యాబినెట్‌ ‌నిర్ణయం తీసుకుంది.మరొక 8 మెడికల్‌ ‌కాలేజీల ఏర్పాటు..రైతులు, హైదరాబాద్‌, ‌వరంగల్‌ అభివృద్ధి పై క్యాబినెట్‌ ‌లో పలు నిర్ణయాలు తీసుకుంది.

Leave a Reply