Take a fresh look at your lifestyle.

తాజా కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. భారత్‌లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ

తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ై5) ‌దేశంలో జనాభా మార్పు సంకేతాలను నిర్ధారించింది. 1992లో ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ ‌ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా, స్త్రీల నిష్పత్తి పురుషులను దాటిపోయింది. తాజా సర్వే ప్రకారం 1,000 మంది పురుషులకు 1,020 మంది మహిళలు ఉండగా, 2015-16లో నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి 1,000 మంది పురుషులకు 991 మంది మహిళలు ఉన్నారు. చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉందని తాజా సర్వే సూచిస్తుంది. అయితే పురుషుల కంటే మహిళలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్‌, ‌మహారాష్ట్ర, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ‌హర్యానా, మధ్యప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌జమ్మూ కాశ్మీర్‌ ‌మరియు కేంద్రపాలిత ప్రాంతాలు చండీగఢ్‌, ‌ఢిల్లీ, అండమాన్‌ ‌మరియు నికోబార్‌ ‌దీవులు, దాద్రా మరియు నగర్‌ ‌హవేలీ, లడఖ్‌ ఉన్నాయి. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ స్త్రీల జనాభా పెరుగుదలలో మెరుగుదలను చూపించాయి. ఇక చాలా రాష్ట్రాలు, యూటీల్లో మొత్తం సంతానోత్పత్తి రేటు(టిఎఫ్‌ఆర్‌) ‌రెండు కంటే తక్కువగా ఉన్నాయి.

రెండు కంటే తక్కువ ఉన్నప్పుడు కాలక్రమేణా జనాభాలో క్షీణతను సూచిస్తుంది. కేవలం ఆరు రాష్ట్రాలు..బీహార్‌, ‌మేఘాలయ, మణిపూర్‌, ‌జార్ఖండ్‌ ‌మరియు ఉత్తరప్రదేశ్‌ ‌రెండు కంటే ఎక్కువ టిఎఫ్‌ఆర్‌ ‌కలిగి ఉన్నాయి. బీహార్‌లో క్రితంసారి సర్వే ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-4 ‌ప్రకారం 3.4 ఉండగా తాజా సర్వే ప్రకారం 3 ఉంది. 2040-2050 వరకు భారతదేశ జనాభా 1.6 నుండి 1.8 బిలియన్లకు చేరుకోవచ్చని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా వేసినా ప్రస్తుత అంచనా ప్రకరం కూడా భారతదేశం ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించే అవకాశం ఉంది. 2031 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం చైనాను అధిగమిస్తుందని గత సంవత్సరం ప్రభుత్వ నివేదిక అంచనా వేసింది. ఇది ఐక్యరాజ్యసమితి అంచనా 2022 కంటే దాదాపు ఒక దశాబ్దం తరువాత.

ఇక తాజా సర్వే ప్రకారం కేరళ అత్యధికంగా స్త్రీ పురుషుల నిష్పత్తి 1,121 కలిగిన రాష్ట్రం కాగా టిఎఫ్‌ఆర్‌ 1.6 ‌నుంచి 1.8కి పెరిగింది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో పుట్టిన పిల్లల లింగ నిష్పత్తి కూడా తగ్గుముఖం పట్టింది. 2015-16లో 1,000 మంది పురుషులకు 1,047 మంది స్త్రీలు ఉన్నారు, అది ఇప్పుడు 1,000 మంది పురుషులకు 951కి తగ్గింది. ఈ సర్వే దేశంలోని 707 జిల్లాల(మార్చి, 2017 నాటికి) నుండి సుమారు 6.1 లక్షల నమూనా గృహాలలో నిర్వహించబడగా, 7,24,115 మంది మహిళలు మరియు 1,01,839 మంది పురుషులు జిల్లా స్థాయి వరకు చేసిన పర్వే ద్వారా సేకరించబడంది.

Leave a Reply