Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌కాదు..చావునోట్లో తలపెట్టింది కాంగ్రెస్‌

  • తెలంగాణ ఏర్పాటుకు తన భవిష్యత్‌ను త్యాగం చేసిన పార్టీ
  • కెసిఆర్‌ ‌చేసిందేమీ లేదు
  • సిఎం వ్యాఖ్యలపై మండిపడ్డ జానా రెడ్డి
  • మండల వ్యవస్థను రూపొందించింది   తానేనని వెల్లడి

‌తెలంగాణ కోసం త్యాగం చేసింది కాంగ్రెస్‌ ‌తప్ప కెసిఆర్‌ ‌కాదని సాగర్‌ ‌కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. సాగర్‌ ‌కోసం తానేమి చేయలేదన్న సిఎం కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మండల వ్యవస్థకు ఆద్యుడినే తానేనని అన్నారు. హోంమంత్రిగా నక్సల్స్‌తో చర్చించిన వ్యక్తినని అన్నారు. కాంగ్రెస్‌ ‌తన భవిష్యత్‌ను తాకట్టు పెట్టి, మృత్యుముఖంలోకి వెళ్లి తెలంగాణ ఇచ్చిందని అన్నారు. ఇందుకు బిజెపి కూడా సహకరించిందన్నారు. కానీ కెసిఆర్‌ ‌చేసిందేవి• లేదన్నారు. తాను ఏం చేసానని అనడం కెసిఆర్‌ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ అహంకారానికి.. సాగర్‌ ‌ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. హాలియా సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ ‌మాటలు తనను బాధించాయని జానారెడ్డి తెలిపారు. గురువారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ..అధికార పార్టీ ప్రవర్తన తీరు తనను బాధించిందని ఆవేదనకు లోనయ్యారు. ‘కేసీఆర్‌ ‌చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించానంటున్నారు.. కానీ మా పార్టీని రెండు రాష్ట్రాల్లో చావు నోట్లో పెట్టి తెలంగాణ ఇచ్చిందన్న విషయం మరచిపోవద్దన్నారు. రాష్ట్ర సాధన కోసం మేం పూర్తిగా సహకరించాం కాబట్టే తెలంగాణ వొచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్‌ ‌దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి’ అని జానారెడ్డి కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డారు. 30, 40 ఏళ్లు శాంతి సామరస్యలు వెల్లివిరిసేలా తాను పనిచేశానని అన్నారు. ‘కెసిఆర్‌ ‌ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేస్తా అన్నారు..కానీ హైదరాబాద్‌లోనే కుర్చీ వేసుకుని కూర్చున్నారు’ అని వ్యంగ్యంగా మాట్లాడారు జానారెడ్డి. బుధవారం హాలియాలో సీఎం కేసీఆర్‌ ‌నిర్వహించిన ప్రచారసభలో కాంగ్రెస్‌ ‌నేతలను టార్గెట్‌ ‌చేసి మాట్లాడిన తీరుపై, జానారెడ్డే సీఎం పదవి కోసం తిరుగుతారని ఎద్దేవా చేసిన విషయంపై జానారెడ్డి సీరియస్‌ అయ్యారు.

Leave a Reply