Take a fresh look at your lifestyle.

జనగామ గడ్డ..ఉద్యమాల అడ్డ

  • కోట్లాటల పార్టీ కాంగ్రెస్‌…11 ‌సార్లు ఆవకాశం ఇస్తే ఆబివృద్ధి శూన్యం
  • ఈ నెల 16న జనగామలో కేసిఆర్‌ ‌సభ
  • జనగామ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్‌రావు
  • కాంగ్రెస్‌ ‌పార్టీవి దొంగ సర్వేలు : మంత్రి దయాకర్‌రావు
  • సిఎం కేసిఆర్‌ ‌హయంలోనే తెలంగాణ ఆబివృద్ధి : మంత్రి సత్యవతి రాథోడ్‌
  • ‌జనగామ ఆబివృద్ధి కొరకు కృషి చేస్తా : పల్లా రాజేశ్వర్‌రెడ్డి  

జనగామ, ప్రజాతంత్ర, ఆక్టోబర్‌ 11 : ‌తెలంగాణ ఉద్యమంలో జనగామ ప్రజలు కీలకపాత్ర పోషించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ‌నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు హరీష్‌ ‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ బస్వారాజ్‌ ‌సారయ్య, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్‌ఎస్‌ ‌జనగామ ఆభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు పాల్గ్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…జనగామ గడ్డ పోరాటల అడ్డ అని తెలంగాణ ఉద్యమంలో జనగామ ప్రజలు చేసిన కృషి మరువలేనిదన్నారు. 2001లో జనగామలో ప్రతి ఒక్క గ్రామంలో గులాబీ జెండా ఎగరవేయడం జరిగిందని, అందుకే సిఎం కేసిఆర్‌కు జనగామ జిల్లా మీద ప్రేమ ఉంటుదన్నారు. 2009లో ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్‌ ‌పార్టీ వెనుకకు తీసుకుంటే టిఆర్‌యస్‌ ఎమ్మెల్యేలు మాత్రమే రాజీనామ చేయడం జరిగిందన్నారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ టికెట్లు ఇవ్వక ముందే తన్నుకుంటున్నారని కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే మాటలు, గ్రూపులు, ముఠాలు, మంటలన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఒక్కసారి ఆవకాశం ఇవ్వాలని అంటున్నారని, 11 సార్లు ఆవకాశం ఇస్తే ఆబివృద్ధి శూన్యం అన్నారు. కాంగ్రెస్‌ ఆధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణకు ఇచ్చిన హమీలు ఎందుకు ఆమలు చేయడం లేదో సమాధానం చేప్పాలన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధికారంలోకి వొచ్చిన తరువాత రైతుల ఆత్యహత్యలు చేసుకుంటునరన్నారు. సిఎం కేసిఆర్‌ ‌రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులను అందుకోవడం జరుగుతుందన్నారు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ‌పరిస్థితి దయనీయంగా ఉందని, ఒక నాయకుడు కన్న తల్లిదండ్రులకు గంజి పోయని డు కాగా..మరో నాయకుడు ఆరునెలలు అయినా నియోజకవర్గంలో ఆడ్రస్‌ ‌లేని వాడని హరీష్‌ ‌రావు ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి సిఎం కేసిఆర్‌ ‌క్యాబినేట్‌ ‌హోదా ఇవ్వడం జరగిందన్నారు. అన్ని గ్రూప్‌ ‌తగదాలను పక్కనపెట్టి పార్టీ కొరకు పని చేయాలని ఆయన క్యాడర్‌కు సూచించారు. రానున్న ఎన్నికల్లో పల్లాను భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పల్లాను గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌ ‌చేస్తామని హమీ ఇచ్చారు. సిఎం కేసిఆర్‌ ‌గత ఎన్నిక మేనిపోస్ట్‌లో ప్రవేశపెట్టిన హమీలను నేరవేర్చడం జరగిందన్నారు. ఆక్టోబర్‌ 15‌న సిఎం కెసిఆర్‌  ఎన్నికల మేనిపోస్ట్‌ను విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఆక్టోబర్‌ 16‌వ తేదిన జనగామలో సిఎం కేసిఆర్‌ ‌భహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న తరలిరావాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

కాంగ్రెస్‌ ‌పార్టీవి దొంగ సర్వేలు : మంత్రి దయాకర్‌రావు
60 యేండ్ల పాలనలో కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన ఆబివృద్ధి శూన్యమని మంత్రి దయాకర్‌ ‌రావు అన్నారు. తన 40 యేండ్ల రాజకీయంలో ఎవరు చేయని ఆబివృద్ధిని సిఎం కేసిఆర్‌ ‌చేసి చూపించారని అన్నారు. ఇరిగేషన్‌ ‌మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య జనగామకు ఒరుగుబెట్టిందేమీలేదన్నారు. సిఎం కేసిఆర్‌ ఆధికారంలోకి వొచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తన రాజకీయ ఆనుభవంలో పేదల కోసం పనిచేసిన సిఎంలు ఎన్టీఆర్‌, ‌కేసిఆర్‌ అన్నారు. ఆక్టోబర్‌ 16‌న జరుగబోయే బహిరంగ సభను చూసి కాంగ్రెస్‌ ‌పార్టీకి భయం పుట్టాలని, కార్యకర్తలు ఆధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయలని ఆయన పిలుపునిచ్చారు. నామినేషన్‌ ‌వేయాలంటే ప్రతిపక్షలకు భయం పుట్టాలన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ దొంగ సర్వేలు చేస్తూ ప్రజలను మోసం చేయాడానికి  ప్రయత్నిస్తునారన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి వోటు వేసేందుకు ప్రజలు ఎవరు సిద్ధంగా లేరన్నారు.

సిఎం కేసిఆర్‌ ‌హయంలోనే తెలంగాణ ఆబివృద్ధి : మంత్రి సత్యవతి రాథోడ్‌
‌పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సిఎం కేసిఆర్‌ అని మంత్రి పత్యవతీ రాథోడ్‌ అన్నారు. సంకాంత్రి వొస్తే గంగిరెద్దులు వొచ్చినట్టు ప్రతిపక్షాలు ఎన్నికలు వొచ్చినప్పుడే ప్రజలు వద్దకు వొస్తారన్నారు. తండాలను గ్రామ పంచాయితీలుగా, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించిన ఘనత సిఎం కేసిఆర్‌ ‌కే దక్కుతుందన్నారు. సిఎం కేసిఆర్‌కు పల్లా ఆత్యంత సన్నిహితుడని, నియోజకవర్గ సమస్యలను నేరుగా సిఎం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడం జరుగుతుందని, ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో పల్లాను భారీ మోజార్టీతో గెలిపించుకుని సిఎం కేసిఆర్‌కు బహుమతి ఇవ్వాలని ఆమె కోరారు.

జనగామ ఆబివృద్ధి కొరకు కృషి చేస్తా : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
తెలంగాణ సాయుధపోరాటంలో జనగామ ముందుందని బీఆర్‌స్‌ ‌జనగామ అభ్యర్థి పట్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి అన్నారు. తనపై నమ్మకంతో సిఎం కేసిఆర్‌ ‌తనకు జనగామ టిక్కెట్‌ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఈ 50 రోజులు తన కోసం పని చేస్తే నియోజకవర్గ ప్రజలకు 5 సంవత్సరాలు పాలేరుగా ఉంటనన్నారు. జనగామ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తను ముందుటానని ఆయన ఈసందర్భంగా హమీ ఇచ్చారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తాన్నాని హమీ ఇచ్చారు.

Leave a Reply